
కోవిడ్ టెస్ట్‌లు, టీకాలకు హైదరాబాదీలు పోటెత్తుతున్నారు. ఉదయాన్నే మన్సురాబాద్‌లోని పీహెచ్‌సీకి కరోనా టెస్ట్‌ల కోసం వచ్చినవారు తమ వంతు కోసం చెప్పులను ఇలా క్యూలో పెట్టారు. సరోజినీ కంటి ఆస్పత్రి, కింగ్ కోటి ఆస్పత్రుల్లో టెస్టులు, టీకాల కోసం కిటకిటలాడుతూ కనిపించారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం చెరువులో నీరు తగ్గడంతో మత్స్యకారులు చేపలు పట్టారు. వారి కష్టానికి తగ్గట్లు పెద్ద పెద్ద చేపలు పడటంతో వాటిని పట్టుకుని ఇదిగో ఇలా.. ఆనందం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల

కరోనా కన్నెర్రజేసి బంధాలను దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మండుటెండలో వేరుశనగ తెంపుతున్న పొచ్చక్క అనే ముసలమ్మ, ఇదిగో ఇలా.. స్మార్ట్‌ఫోన్‌లో తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతూ, తాను పడుతున్న కష్టాన్ని మరిచిపోయి సంబరపడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది ప్రాంతంలోని ఓ చేనులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

గురుగ్రామ్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని కోవిడ్ బాధితులకు ఇలా ఆరుబయట, కార్లలోనూ ఆక్సిజన్ అందిస్తోంది.

ఢిల్లీలోని నరైనాలోని ప్లాంట్ వద్ద ఆక్సిజన్ సిలిండర్‌ను నింపుకునేందుకు ఎదురుచూస్తున్న కోవిడ్ బాధితుల కుటుంబీకులు.

కోవిడ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అండగా ఉంటామని భరోసానిస్తూ అందుకు సూచికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. అక్కడి భవనాలపై మువ్వన్నెల రంగుల్లో విద్యుత్ దీపాలను వెలిగించిన దృశ్యం