
ఆపత్కాలంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ సాటివారికి సహాయపడుతున్నారు. కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు సిద్దిపేటకు చెందిన శశికర్‌నంద అనే యువకుడు బైక్ అంబులెన్స్ నడిపిస్తున్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యం అందించలేమని కింగ్‌కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోనే బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ‘టౌటే’ తుపాను ధాటికి అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌక నుంచి పలువురిని కాపాడటంతో ‘బతుకు జీవుడా’ అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో బుధవారం మ్యుకోర్మైకోసిస్ వార్డులో బ్లాక్ ఫంగస్ బాధిత రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు

గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)లో కరోనా రోగుల ఆరోగ్య సమాచా రాన్ని వారి బంధువులకు తెలిపేందుకు కోవిడ్ హెల్ప్ డెస్క్‌ను బుధవారం నుంచి ప్రారంభిం చారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌హెచ్‌ఎఫ్), మోడ్రన్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా (ఎంఏఆర్‌ఐ) సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్ సేవలను నిర్వహిస్తున్నాయి.

ఆపత్కాలంలో కరోనా బాధితులకు సాయం అందించేందుకు సిద్దిపేటకు చెందిన శశికర్‌నంద వినూత్నంగా ఆలోచించాడు. ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనం సహాయంతో నడిచే మొబైల్ అంబులెన్స్‌ను తయారు చేయించాడు. అత్యవసర సమయంలో తన నంబర్‌కు ఫోన్ చేస్తే బాధితులకు ఉచితంగా ఆస్పత్రికి చేరవేస్తున్నాడు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతూ చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న ఏపీ రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల రోగులకు చికిత్స చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో బాధితులు అంబులెన్స్‌ల్లోనే వేచిచూస్తున్నారు.

అడవులను నమ్ముకున్న ఆదివాసీలు రాళ్లు రప్పలు ఉన్నటువంటి భూమిని చదును చేసి సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వానకాలం పంటలకు పంట పొలాలను సన్నద్ధం చేస్తున్నారు. మంటుటెండలను సైతం లెక్కచేయకుండా దున్నిదున్నుతున్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని లోహార గ్రామపంచాయతీ పరిధిలోని సాలెగూడలో రైతులు పంటలు వేసేందుకు పొలాలను చదును చేస్తున్నారు.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అటవీ అందాలు మోడువారాయి. చెట్ల ఆకులు రాలిపోవడంతో పచ్చదనం లేకుండా పోయింది. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని ఖండాల అటవీ ప్రాంతంలో బుధవారం కారుమబ్బుల మధ్య మోడువారిన చెట్లు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

జమ్మూలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరు బయటే కృత్రిమ ఆక్సిజన్ అందిస్తూ కోవిడ్ బాధితురాలికి చికిత్స చేస్తున్న దృశ్యం

అరేబియా సముద్రంలో మునిగిపోయిన బార్జ్ నుంచి భారత నావికాదళం కాపాడిన వ్యక్తులు ఐఎన్‌ఎస్ కొచ్చి నావల్ షిప్ నుంచి బయటికి వస్తున్న దృశ్యం

కోవిడ్ బాధితుల చికిత్స కోసం అనువుగా ఐసీయూ పడకలతో వైద్య సదుపాయాలతో సిద్ధం చేసిన బస్సు ఇది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రవాణా బస్సును ఇలా తీర్చిదిద్దారు. ‘ఐసీయూ ఆన్ వీల్స్’ గా పిలుచుకునే ఈ బస్సును బుధవారం బెంగళూరుకు తీసుకొచ్చినపుడు తీసిందీ ఫొటో

కోవిడ్ ఆంక్షలు పాటించనందుకు జార్ఖండ్‌లోని ఝరియా పట్టణంలో పౌరులను శిక్షిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment