హైదరాబాద్ నగరంలో జంక్షన్లు జిగేల్‌మంటున్నాయి. సరికొత్త అందాలతో నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ట్రాఫిక్ ఐలాండ్స్, కూడళ్ల వద్ద ఇబ్బందులు తగ్గించే చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టింది. ముఖ్యంగా పాదచారుల కోసం లేన్‌మార్క్‌లు, వాహనాలు అతి వేగంగా వెళ్లకుండా రంబుల్ స్ట్రిప్స్ వంటివి ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో..వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ఆయా జంక్షన్లలో నిర్వహించిన ట్రాఫిక్ స్టడీలో గుర్తించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో చోట ఒక్కో థీమ్‌తో ట్రాఫిక్ ఐలాండ్లు, జంక్షన్లను అందంగా తీర్చిదిద్దారు. ఓ చోట కెమెరామెన్...మరోచోట రాతిసోయగం...ఇంకో చోట నీటిని ఒడిసిపట్టాలనే సందేశాత్మక రూపాలను పొందుపర్చారు. – సాక్షి, సిటీబ్యూరో/స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు
చింతల్‌కుంట చౌరస్తాలో (ఎల్బీనగర్)
శిల్పారామం ఎదురుగా..
జీవీకేమాల్ ఎదురుగా...
ఎంజే మార్కెట్ సర్కిల్
సైఫాబాద్‌లో
Comments
Please login to add a commentAdd a comment