ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనవసరంగా రోడ్డెక్కే వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినా.. నిబంధనలు కఠినతరం చేసినా నగర వాసుల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. అవసరార్థం రహదారులపైకి వస్తున్నవారు కొందరైతే.. కారణాలు లేకుండా వస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. ఇలా రోడ్డుపైకి వచ్చిన వారిని పోలీసులు తనిఖీ చేశారు. అకారణంగా వచ్చిన వారికి జరిమానాలు విధించారు. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించినా నగర వాసులు కొందరు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఏవో సాకులు చెప్పి ఇష్టారీతిగా బండ్లపై తిరిగేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.
1/7
హైదరాబాద్‌లో గురువారం లాక్‌డౌన్ సమయంలో వాహనదారుడిని ఆపి ప్రశ్నిస్తున్న మహిళా పోలీసులు
2/7
ఎల్‌బీ నగర్‌లోని పోలీసు కమిషనర్ క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో షీ టీమ్ సిబ్బందికి ఇచ్చిన స్కూటర్లను ప్రారంభిస్తున్న రాచకొండ సీపీ మహేస్ భగవత్
3/7
బాలల కథల్లో హీరో స్పైడర్‌మ్యాన్ క్లిష్ట సమయాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోయినట్టు ఈ వాహనం కూడా కరోనా కష్టకాలంలో రెక్కలు విచ్చుకుని వాలిపోతోంది. హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేస్తోంది. ఆరోగ్యసిద్ధిరస్తు అంటూ శుద్ధిచేస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
4/7
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ఎనిమిది కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని పార్వతమ్మగూడెం, వస్రాంతండాలో బుధవారం రాత్రి కురిసిన వర్షం, పిడుగుపాటుకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ తండాలకు చెందిన బానోతు బాలు, గుగులోతు రవి, గుగులోతు శంకర్, లచ్చు, కిషన్, వీరన్న, వెంకట్‌రాంలు గురువారం ఉదయం తమ ఎద్దులను మేత కోసం బయటకు వదిలారు. రాత్రి తెగిపడ్డ విద్యుత్ తీగలు ఎద్దులకు తగలడంతో 8 ఎద్దులు మృత్యువాత పడ్డాయి.
5/7
భారీ స్థాయిలో కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వారి డెత్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు కాన్పూర్‌లో క్యూలో నిల్చున్న మృతుల బంధువులు
6/7
గ్రీస్‌లోని అడవుల్లో రేగిన కార్చిచ్చు బుధవారం రాత్రి అథెన్స్ దక్షిణ భాగంలో నివాస ప్రాంతాల్లోకి వ్యాపించింది. కొరింత్ సమీపంలోని స్కినోస్ గ్రామంలో ఆహుతి అవుతున్న ఇళ్లు
7/7
డైమ్లర్ ట్రక్స్ కంపెనీ రూపొందించిన హైడ్రోజన్, బ్యాటరీలతో నడిచే ఎలాంటి ఉద్గారాలు లేని, డ్రైవర్ లెస్ నమూనా ట్రక్కు ఇది. గురువారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దీనిని ప్రదర్శనకు ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment