రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో కరోనా టీకాలు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశ రాజకీయాలు, ఇతర విశేషాలతో స‘చిత్ర’ కథనం..
1/9
సాయంత్రం 6.30: లాక్‌డౌన్ సడలింపు సమయం ముగిసిన తరువాత బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1. మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లే మార్గం వాహనాలతో కిక్కిరిపోయిన దృశ్యం.. అదే సమయంలో పంజగుట్ట వైపు వెళ్లే మార్గంలో రద్దీ కనిపించలేదు.
2/9
రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట వద్ద రహదారి మీదుగా పారుతున్న నక్కవాగు
3/9
వర్షం కురిసింది... వాగు పొంగింది.. ఊళ్ల మధ్య రాకపోకలు ఆగాయి. మగవారే వాగు దాటేందుకు జంకే పరిస్థితి. అయినా భయపడకుండా వాగు దాటి వెళ్లి వైద్యం అందించి వచ్చారు ఏఎన్‌ఎం విజయసుందరి (వాల్గొండ ఆరోగ్య ఉప కేంద్రం), ఆశ వర్కర్ మైనాబాయి. ఆదిలాబాద్ జిల్లా వడ్‌గాం వాగు దాటి వెళ్లి మామిడిగూడ(జి)లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసి శభాష్ అనిపించుకున్నారు. – ఇంద్రవెల్లి(ఖానాపూర్)
4/9
ఢిల్లీలో సోమవారం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ సందర్భంగా ఆయనతో మాట్లాడుతున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
5/9
మహారాష్ట్ర దాదర్ రైల్వేస్టేషన్‌లో ప్రతీ ప్రయాణికుడు కరోనా టెస్టు చేయించుకోవాలనడంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగుతున్న ఓ యువకుడు.
6/9
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం ముంబైలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అభిమానులు
7/9
ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా సోమవారం బోరివలిలో ఆయన ఫేస్ మాస్కు ధరించి కేక్ కట్‌చేస్తున్న గిరిజన ప్రాంత చిన్నారులు
8/9
104 ఏళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించిన రఘునాథ్ జాధవ్‌ను డిశ్చార్జి చేసి ఆస్పత్రిని బయటకు తీసుకొస్తున్న దృశ్యం. సోమవారం మహారాష్ట్రలోని కరాడ్‌లో తీసిందీ ఫొటో.
9/9
కుళ్లిన మాంసం వాసనను వెదజల్లి.. కీటకాలను ఆకర్షించి, భక్షించే అత్యంత భారీ సైజు టైటాన్ ఆరమ్ జాతి పువ్వు ఇది. పోలండ్‌లోని వార్సాలో వార్సా వర్సిటీ బొటానికల్ గార్డెన్‌లో ఉందీ భారీ పువ్వు. ఇది పుష్పించడానికి కొన్ని గంటల ముందు నుంచే దీన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు ఆ గార్డెన్ వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment