చక్కర్లు కొడుతుంది.. నెట్ సౌకర్యమిస్తుంది
ఫొటో ఫీచర్
ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ ఒక భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదేమోగానీ.. గ్రామీణులతోపాటు చాలా పేదదేశాల్లో ఇది ఇప్పటికీ గగన కుసుమమే. ఈ కొరతను తీర్చేందుకు, ఆపత్కాలాల్లో ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది... పోర్చుగీస్‌కు చెందిన క్వార్క్‌సన్ అనే కంపెనీ. చిన్న చిన్న డ్రోన్‌ల సాయంతో ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ఈ కంపెనీ చేపట్టిన ‘స్కై ఆర్బిటర్’ ప్రాజెక్టు లక్ష్యం.
ఫొటోలో కనిపించేది క్వార్క్‌సన్ తయారు చేసిన ఆరు రకాల డ్రోన్‌లలో ఒకటి మాత్రమే. వీటిల్లో కొన్ని తక్కువ ఎత్తులో ఎగురుతూ కొన్ని వారాలపాటు ఇంటర్నెట్ సంకేతాలను ప్రసారం చేయగలిగితే... మిగలినవి భూమి నుంచి 72 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఏళ్లతరబడి నిరంతరం పనిచేస్తూంటాయి.