‘ఆకులు రాలె.. వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే.
- వేసవితో మోడువారి కళావిహీనం
‘ఆకులు రాలె.. వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే. కుంకుమ పూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే’ అని వేటూరి వారు అద్భుతంగా ప్రణయగీతాన్ని రాశారు. ఎండ దెబ్బకు చెట్లు మోడువారిపోతున్నాయి. ఆకులు నిర్జీవమై రాలిపోతున్నాయి. కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి గట్టున ఉన్న 100 ఏళ్ల నాటి ‘సినిమా చెట్టు’ కూడా కాలానికి తలవంచింది. ఎన్నో సినిమాల్లో పచ్చని కొమ్మల వయ్యారాన్ని ఒలకబోసిన ఈ చెట్టు కొత్త చిగుళ్లు తొడిగేందుకు సిద్ధమవుతోంది. ఆకులు మొత్తం నేలరాలడంతో మోడువారి కనిపిస్తోంది.
- కొవ్వూరు రూరల్(పశ్చిమగోదావరి)