Photo Feature: అలుగు పోసింది.. కొండను కమ్మేసింది! | Local to Global Photo Feature in Telugu: Check Dam, Khammam, Covid Vaccination, Vijayawada | Sakshi
Sakshi News home page

Photo Feature: అలుగు పోసింది.. కొండను కమ్మేసింది!

Published Sat, Jun 5 2021 5:44 PM | Last Updated on Sat, Jun 5 2021 6:05 PM

Local to Global Photo Feature in Telugu: Check Dam, Khammam, Covid Vaccination, Vijayawada - Sakshi

కరోనాను అదుపు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండటంతో రవాణా స్తంభిస్తోంది. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాగా, తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, నీటి కుంటలు నిండుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/9

తిరుమలలోని మొదటి ఘాట్‌ రోడ్డులో సూర్య భగవానుడు విరజల్లుతో కనిపించాడు. సాయం సంధ్యావేళ గరుత్మంతుని ఒడ్డున భగ భగ మండే ఎర్రటి కిరణాలను విరజల్లుతూ పచ్చటి ప్రకతి సోయగాల మధ్య ఇలా అస్తమిస్తున్న భానుడి సోయగం గురువారం సాక్షి కెమెరా క్లిక్‌ మనిపించింది. - మోహన్‌కష్ణ కేతారి, సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి

2
2/9

అందినంత నాదే అన్నట్లు అల్లుకుంది తీగ... అందమైన ప్రకతిలో పచ్చదనంతో కలిసిపోయి చెట్టూ చేమ అంతా తానే అన్నట్లు ప్రహరీ గోడతోపాటు చెట్లను సైతం గొడుగులా కప్పుకుంది. పెద్దపల్లి నుండి సుల్తానాబాద్‌ వెళ్ళేదారిలో సుగ్లాంపల్లి వద్ద ఈ సుందర దశ్యం రాజీవ్‌రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తూ కనిపించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, పెద్దపల్లి

3
3/9

మండుతున్న ఎండలైనా మాకు ఫర్వాలేదు.. ఆటల్లో నిమగ్నమౌతూ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా బోరు వాటర్‌తో జలకళలాడుతున్న చిన్నారులు.. విజయనగరం జిల్లా కేంద్రంలో గొట్లాం గ్రామంలో బోరు వాటర్‌తో స్నానం చేస్తున్న చిన్నారులు. - డి.సత్యనారాయణమూర్తి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం

4
4/9

కర్ఫ్యూ సడలింపు సమయంలో రోడ్లపైకి వాహనాలు పోటెత్తడంతో విజయవాడలో స్తంభించిన ట్రాఫిక్‌ - చక్రపాణి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

5
5/9

కదులుతున్న లారీపై పడుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కార్మికులు. - చక్రపాణి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

6
6/9

హైదరాబాద్‌ నగరంలో పచ్చదనం పంచుతూ పువ్వలతో అలరారుతున్న చెట్లు. - బాలస్వామి, సాక్షి ఫొటోగ్రాఫర్, హైదరాబాద్‌

7
7/9

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమైంది. సూపర్‌ స్ప్రెడర్లతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి సైత్యం వ్యాక్సిన్‌ వేస్తుండటంతో జనం తాకిడి పెరిగింది. శివరాంపల్లిలోని ఓ కన్వెక్షన్‌ హాలులో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టిన జనం.. బేగంబజార్‌లో మహేశ్వరి భవన్‌ వద్ద వ్యాక్సిన్‌ తీసుకుంటున్న దివ్యాంగ యువతి. - సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు

8
8/9

పొర్లిన చెక్‌డ్యామ్‌.. ఖమ్మం నగరంకు ఆనుకొని ప్రవహిస్తున్న మున్నేటిలోని నీరు దిగువకు వృధాగా పోకుండా ఉండేందుకు ప్రకాశ్‌నగర్‌ వద్ద మున్నేటిపై చెక్‌డ్యామ్‌ను ఇటీవలే నిర్మించారు. నిర్మాణం పూర్తి అయిన కొన్ని రోజుల తర్వాత గురువారం మూడు గంటల పాటు కురిసిన వర్షానికి చెక్‌డ్యాంమ్‌ నిండి పొంగి అలుగు పోసింది. చెక్‌డ్యామ్‌ వద్ద నీరు పొంగి పొర్లుతుండడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఆసక్తిగా చూసి నగర ప్రజలకు నీటి సమస్య తీరినట్లే అని అనుకున్నారు. – సాక్షి సీనియర్‌ ఫోటో జర్నలిస్ట్, ఖమ్మం

9
9/9

ముంబైలోని సీఎస్టీ, బీఎంసీ భవనాలపై శుక్రవారం దట్టంగా కమ్ముకున్న మేఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement