check dam
-
‘టీజీ’కో టీఎంసీ!
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీలు..! రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! చేతిలో మంత్రి పదవి..! ఏకంగా పరిశ్రమలశాఖ! ఇంకేముంది..? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికారంలో ఉండగానే తన ఫ్యాక్టరీల నీటి అవసరాల కోసం చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ ఉపక్రమించారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించడంతో కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల పేరుతో తుంగభద్ర నదిపై చెక్‌డ్యాం నిర్మించి నది ఒడ్డున ఉన్న తమ ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీర్చుకునే ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ! పైగా మంత్రి పదవిలో ఉండటంతో అధికారులు ‘జీ హుజూర్’ అంటూ ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు.– సాక్షి ప్రతినిధి కర్నూలు కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో రెండు ఆల్కలీస్ ఫ్యాక్టరీలున్నాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి–జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేశ్ తన ఫ్యాక్టరీకి సమీపంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించాలని భావించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించేందుకు 2013 జూన్ 18న జీవో 56 జారీ చేయించారు. రూ.64.89 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి 0.50 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలా ఫలకాన్ని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆపై టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో 2017లో మరోసారి అధికారులు రూ.177 కోట్లతో డీపీఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సీడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్‌డ్యాం నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కూటమి రాగానే మరోసారి ప్రతిపాదనలుప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యాం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21న ఇరిగేషన్ ఎస్ఈకి ఓ లేఖ రాశారు. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీపై చెక్‌డ్యాం నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని, 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీనిపై అదే నెల 27న ఇరిగేషన్ ఎస్ఈ తిరిగి కార్పొరేషన్ ఎస్ఈకి లేఖ రాశారు.చెక్‌డ్యాం నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలతలు, ప్రతికూలతలతోపాటు సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలన్నీ పరిశీలించి ఫీజుబులిటి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి అధికారుల ప్రతిపాదన ఇదీ.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. శివారు కాలనీలకు తాగునీటి సమస్య ఉండటంతో మునగాలపాడు వద్ద రూ.15 కోట్లతో మరో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీంతో పాటు అమృత్ ద్వారా హంద్రీ–నీవా నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అమృత్ పథకం కింద మంజూరైన రూ.130 కోట్లు కాకుండా తక్కిన మొత్తాన్ని మంజూరు చేయించుకుని చెక్‌డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మిస్తే 0.50 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని, అందులో 0.30 టీఎంసీలు కర్నూలు తాగునీటి అవసరాలకు, తక్కిన 0.20 టీఎంసీలు తన పరిశ్రమలకు వినియోగించుకునేలా జీవో మంజూరు చేసేలా మంత్రి టీజీ భరత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రివర్స్ పంపింగ్ చేస్తారా? కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే హంద్రీ–నీవా నుంచి ప్రతిపాదనలు ఉన్నపుడు దాన్ని పూర్తి చేయకుండా చెక్‌డ్యాంను తెరపైకి తేవడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం టీజీ ఫ్యాక్టరీల కోసమే మంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ చెక్‌డ్యాం నిర్మించాల్సి వస్తే మునగాలపాడు సమీపంలో నిర్మిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు దగ్గరవుతుంది. అలా కాకుండా రాఘవేంద్ర మఠం సమీపంలో చెక్‌డ్యాం నిర్మించి తిరిగి రివర్స్ పంపింగ్ చేయాలని అంటున్నారు.పైగా కర్నూలు మురుగునీరు మొత్తం అందులో నిల్వ ఉంటుందని, తుంగభద్రలో నీటి ప్రవాహం లేనపుడు కేవలం మురుగునీటి మడుగుగా మారే అవకాశం ఉందని, ఆ నీటిని తాగునీటికి ఎలా వినియోగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నీటితో కేవలం టీజీ ఫ్యాక్టరీల అవసరాలు మాత్రమే తీరుతాయని చర్చించుకుంటున్నారు. -
దెయ్యం చేపలు!
భద్రాచలం: తిరుమలాయపాలెం మండలంలోని బీసురాజుపల్లి ఆకేరు చెక్‌డ్యామ్ నీటిలో గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని తెలుస్తోంది. స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్‌డ్యామ్‌లోకి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, ఇవి చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
పండుగ వేళ విషాదం... అన్న సాఫ్ట్వేర్, తమ్ముడు బ్యాంక్ మేనేజర్
నడికూడ/ రేగొండ :పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వాగులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దోపతి సమ్మిరెడ్డికి ఇద్దరు కుమారులు దొపతి జగన్ రెడ్డి(33) మల్లారెడ్డి(31) ఉన్నారు. ఇందులో జగన్‌రెడ్డి సాఫ్ట్వేర్, మల్లారెడ్డి బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇద్దరి అత్తగారి ఊరు మండలంలోని వరికోల్‌కు చేరుకున్నారు. సోమవారం సరదాగా పక్కన ఉన్న నార్లాపూర్ చెక్ డ్యాం చూసేందుకు వెళ్లారు. అక్కడ వాగులో ఈత కొడుతూ వరద నీటిలో గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వీరి కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో కేకలు వేయగా స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పరకాల సీఐ వెంకటరత్నం, ఎస్సై రమేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మృతుల తండ్రి సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇద్దరు మృతి.. గతంలో ఇదే చెక్ డ్యాంలో పడి నార్లపూర్ గ్రామానికి చెందిన ఈ ర్ల అభినవ్, ఈర్ల కౌశిక్ మృతి చెందారు. చెక్ డ్యాం వద్ద ఇసుక దిబ్బలు పేరుకుపోవడం, వాగు వరదకు లోతైన గుంతలు ఏర్పడడం వల్ల గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెరువులో పడి వ్యక్తి.. కాటారం: పూల కోసం వెళ్లిన వ్యక్తి చెరువులో మునిగి రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. ఘటన మంగళవారం కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన భక్తు గణేశ్(26) ఈ నెల 22న దామెరకుంటలోని అత్తగారి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమ ధ్యలో గుమ్మాళ్లపల్లి గ్రామ సమీపంలోని ఊర చెరువులోకి పూల కోసం వెళ్లి నీటిలో మునిగాడు. మంగళవారం ఉదయం అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి బయటకు తీశారు. మృతదేహాం అప్పటికే కుళ్లిపోగా గ్రామస్తుల ద్వారా గణేశ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సమరియా, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. -
Heeraben Modi: చెక్ డ్యామ్‌కు మోదీ తల్లి పేరు
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళిగా గుజరాత్‌లోని ఓ చెక్ డ్యామ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ. 15 లక్షలతో రాజ్‌కోట్-కలావడ్ రోడ్డులోని వాగుదాడ్ గ్రామ సమీపంలో న్యారీ నది వద్ద ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. ఈ డ్యామ్ నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే దర్షితా షా, రాజ్‌కోట్ మేయర్ ప్రదీప్ దావ్ సమక్షంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ తల్లికి నివాళిగా ఈ చెక్ డ్యామ్‌కు హీరాబా స్మృతి సరోవర్ అని నామకరణం చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు గిర్ గంగా పరివార్ ట్రస్ట్ వాళ్లు. తద్వారా అయినవాళ్లు దూరమైనప్పుడు ఓ మంచి పని చేయాలనే ఆలోచన మరికొందరిలో కలుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. గిర్ గంగా పరివార్ ట్రస్ట్.. పూర్తిగా విరాళాల సేకరణతోనే గత నాలుగు నెలల్లో 75 చెక్ డ్యామ్‌లు కట్టించింది. ప్రస్తుత డ్యామ్ నాలుగు వందల ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు ఉంటుందని, ఒక్కసారి డ్యామ్ నిండితే తొమ్మిది నెలల వరకు నీరు ఎండిపోదని, చుట్టుపక్కల గ్రామాలకు నీటి సమస్య తీరనుందని ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. -
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు
దొడ్డబళ్లాపురం: సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు గల్లంతైన సంఘటన కనకపుర తాలూకాలోని పర్యాటక కేంద్రం చుంచి ఫాల్స్ వద్ద జరిగింది. బెంగళూరు శంకరమఠం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ చంద్ర (26) మంగళవారంనాడు ముగ్గురు స్నేహితులతో కలిసి చుంచి ఫాల్స్ చూడడానికి వచ్చాడు. నీరు ప్రవహించే చోట బండరాయిపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండగా జారి 18 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి పడిపోయాడు. అతని స్నేహితులు కొంతసేపు వెతికినా కనిపించలేదు. దీంతో సాతనూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. చెక్‌డ్యాంలో మునిగి ఇద్దరు మృతి మైసూరు: దేవస్థానం దర్శనం కాస్తా విషాదమయం అయ్యింది. చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగిపోయి మృతి చెందిన సంఘటన చామరాజనగర జిల్లాలో కొళ్లెగాల తాలూకాలోని చిక్కల్లూరులో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా లింగపట్టణ గ్రామానికి చెందిన సునీల్ (26), చంద్రు (19)లు 30 మందితో కలిసి చిక్కల్లూరు దేవస్థానానికి వచ్చారు. దేవుని దర్శనం అయిన అనంతరం హోసమఠం ముందు భాగంలో ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లారు. చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయారు. స్థానికులు ఈతగాళ్ళను రప్పించి వారి మృతదేహాలను బయటికి తీశారు. కొళ్లెగాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్) -
Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్‌డ్యాం
జహీరాబాద్: సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెక్‌డ్యాంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట తండాలో బుధవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీర్శెట్టి పెద్ద కొడుకు అరవింద్(11), విజయ్‌పవార్ రెండో కొడుకు శ్రీనాథ్ (9) మధ్యాహ్నం ఈత కోసం తండా శివారులోని చెక్‌డ్యాంలోకి దిగారు. లోతుగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా నీట మునిగారు. ఒడ్డుపై ఉన్న మరో బాలుడు ప్రేంసింగ్ విషయాన్ని గమనించి కేకలు వేయడంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు మునిగిన ఇద్దరినీ బయటకు తీశారు. వైద్యం కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలురిద్దరూ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. -
బావా బావమరుదుల ఈత సరదా.. రెండు ప్రాణాలు బలి
సాక్షి, కోహెడ(హుస్నాబాద్): చెక్‌డ్యాంలో సరదాగా ఈత దిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని పొరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకొంది. ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం పొరెడ్డిపల్లి గ్రామానికి ఎలుక ప్రశాంత్(21), డబే కుమారస్వామి(19)బావ బావమరుదులు. ఇద్దరు ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంత్ తండ్రి కనకయ్య పొలం వద్ద మోటరు పని చేయడం లేదని కొడుకును హైదరాబాద్ నుంచి రామన్నాడు. దీంతో ప్రశాంత్, కుమార స్వామితోపాటు మరో ముగ్గురు స్నేహితులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ భావి వద్ద మోటరు రిపేర్ చేసి బావి సమీపంలోని చెక్‌డ్యాం వద్దరు వచ్చారు. దీంతో సరదాగా ఒకరి తర్వాత ఒకరు నీటిలో దిగారు. లోతు గమనించిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. అంతలోపే ప్రశాంత్, కుమారస్వామి నీటిలో మునిగిపోయారు. వెంటనేరా ముగ్గురిలో ఒకరైన విజయ్‌కుమార్ అనే యువకుడు ప్రశాంత్, కుమారస్వామి మునిగిపోయిన విషయాన్ని 108కు, పోలీసులకు, ప్రశాంత్ తండ్రి కనకయ్యకు సమాచారం అందించి ఫోన్ స్విచ్ఆఫ్ చేసి అక్కడి నుంచి ముగ్గురు వెళ్లిపోయారు. వెంటనే ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, తహసీల్దార్ రుక్మిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్ నుంచి ఈత వచ్చిన వారిని రప్పించి మునిగిన యువకులు మృతదేహాలను బయటకు తీశారు. నీట మునిగి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఇద్దరు వరుసకు బావ, బావమరుదులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రశాంత్ పొరెడ్డిపల్లి గ్రామం, కుమారస్వామిది దులి్మట్ట గ్రామం ఇద్దరి మృతదేహాలకు శవ పరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
Photo Feature: అలుగు పోసింది.. కొండను కమ్మేసింది!
కరోనాను అదుపు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండటంతో రవాణా స్తంభిస్తోంది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాగా, తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, నీటి కుంటలు నిండుతున్నాయి. -
తల్లి నిస్సహాయత.. కుమారుడి మృత్యువాత
యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీట మునుగుతుంటే తల్లి మనసు తల్లడిల్లింది. నిస్సహాయ స్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్ (11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాత తాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టిం ది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం! చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కో సం అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహా న్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఎక్కడికక్కడ కట్టడి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బేసిన్‌లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. తద్వారా కృష్ణానది పునరుజ్జీవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాలేరు, మూసీపై 19 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మిగతా ఉప నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. మహారాష్ట్ర మాదిరే.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నాయి. అయితే ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలు లేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. ఇక ముఖ్యంగా కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఎడాపెడా ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని వాడేస్తోంది. దీంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా కేవలం 568 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఇందులోనూ ఏపీ తన వాటా కింద 379 టీఎంసీల నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 189 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంది. ఇక రాష్ట్ర వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో 89 టీఎంసీల మేర చిన్ననీటి వనరుల కింద కేటాయింపులున్నాయి. ఇవన్నీ కృష్ణాసబ్ బేసిన్‌లోని చిన్న చిన్న ఉపనదులు, వాగుల నుంచి లభ్యమవుతున్న నీరే. అయితే ఈ నీటిని ఒడిసి పట్టుకోకపోవడంతో కేవలం 35 నుంచి 40 టీఎంసీల వినియోగం మాత్రమే ఉంటోంది. ఎక్కడికక్కడే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలోని ఆకేరు వాగుపై 8 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేసింది. కొత్తగా ఇటీవలే సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మూసీనది, పాలేరు వాగుపై 19 చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుమారు రూ.120.51 కోట్లతో పాలనా అనుమతులనిచ్చింది. కోదాడ పరిధిలోనూ పాలేరుపై మరో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా, ఖమ్మం జిల్లా నుంచి సైతం ఇదే పాలేరుపై మరో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇక దీంతో పాటే మహబూబ్‌నగర్‌లోని ఆర్డీఎస్ పరిధిలోని పెద్దవాగుపై మునుపోడ్ మండలంలో మరో చెక్‌డ్యామ్ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. వీటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాగర్ కింద రెండు ఎత్తిపోతలు.. ఇక గరిష్ట ఆయకట్టుకు కృష్ణా నీటి మళ్లింపు లక్ష్యంగా నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌లో కొత్తగా హాలియా ఎత్తిపోతలను రూ.191 కోట్లతో చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది.1.32 టీఎంసీల నీటిని తీసుకుని 12,400 ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రూపొందించారు. ఇదే టెయిల్‌పాండ్ కింద తుంగపాడు బంధం వద్ద 0.95 టీఎంసీల సామర్థ్యంతో 8 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.191 కోట్లతో మరో ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టనున్నారు. వీటికీ ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టనున్నారు. వచ్చే నెల రెండో వారానికల్లా అధికారిక అనుమతులు పూర్తి చేసి, జూలై నాటికి పనులు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
వాన నీటి సుల్తాన్
రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్ మహమ్మద్ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశ్న: నూర్‌మహమ్మద్ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు ప్రారంభమైంది..? నూర్ మహమ్మద్: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్మెంట్లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్ బై స్టెప్ పని చేయడం మొదలుపెట్టా. ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..? మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్‌డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం. ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు? సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం. ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది. ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది? మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..? అవును సార్. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి. ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..? పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్ తోట’ అని చెబుతారు. కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్ మహమ్మద్, ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి ఎడారిలో ఒయాసిస్సు! ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్‌మహమ్మద్, అతని కుమారుడు అజీజ్ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి. కొత్తచెరువుకు చెందిన నూర్‌మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్‌మహమ్మద్ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్‌డ్యామ్ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం. మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్ సహాయంతో వర్మీ కంపోస్ట్(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్‌మహ్మద్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం! కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి. ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది. – నూర్‌మహ్మద్ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా కుమారుడు అజీజ్‌తో నూర్‌మహమ్మద్ – కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా -
చెక్ ‘ఢాం’
అంతులేని అవినీతిఔ నీటి నిల్వ సంరక్షణ పనులకు రూ.2.30 కోట్ల ఖర్చు అప్పుడే నెర్రలు చీలిన కట్టడాలు నాణ్యతను గాలికొదిలి నిధులు బొక్కేసిన వైనం వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో అధికార పార్టీ నేతల అక్రమాలు వాన నీటి సంరక్షణ పనుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో అడుగడుగునా డొల్లతనం కనిపిస్తోంది. చెక్‌డ్యాంలన్నీ నాసిరకంగా చేపట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు నిధులు మింగేశారు. ఫలితంగా లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన కట్టడాలు నెర్రెలిచ్చి పగిలిపోతున్నాయి. వానొస్తే నీరు ఒడిసి పట్టాల్సిన చెక్‌డ్యాంలు మూన్నాల్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. 2009–10 బ్యాచ్ కింద మంజూరైన వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో 28 కొత్త చెక్‌డ్యాం నిర్మాణాలకు రూ.98.33 లక్షలకు పరిపాలనా పరమైన అనుమతి వచ్చింది. ప్రాజెక్ట్ ముగిసే నాటికి(గత ఏడాది సెప్టెంబర్) నిర్మాణాలు పూర్తి చేసి రూ.79.38 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఎన్‌ఎన్‌పీ తండాలో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.3.52 లక్షలు, తట్రకల్లులో పది నిర్మాణాలకు రూ.33.45 లక్షలు, వజ్రకరూరులో ఆరు నిర్మాణాలకు 13.06 లక్షలు, బోడిసానిపల్లిలో ఐదింటికి రూ.15.28 లక్షలు వెచ్చించారు. నిధుల ఖర్చు బాగానే ఉన్నా కట్టడాల్లో మాత్రం నాణ్యత కొరవడింది. ఈ కారణంగా ఏ చెక్‌డ్యాంను చూసినా పగుళ్లు కనిపిస్తున్నాయి. తట్రకల్లులో రైతు దేవపుత్ర పొలం వద్ద నిర్మాణం పూర్తి నాసిరకంగా ఉంది. నీళ్లొస్తే లీకేజీ అయ్యే పరిస్థితి. ఎన్‌ఎన్‌పీ తండాలో రైతు సోమ్లానాయక్‌కు చెందిన పొలం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మట్టి, పొలాల్లో లభించిన రాళ్లను నిర్మాణాలకు ఉపయోగించారు. వజ్రకరూరులోని మద్దిలేటి, బెస్త వెంకటరెడ్డి పొలాల వద్ద నిర్మించిన చెక్‌డ్యాంలు అప్పుడే లీకేజీ అవుతున్నాయి. కొన్ని చోట్ల పనులు తక్కువగా ఉన్నా ఎక్కువ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి అదనంగా బిల్లులు దిగమింగినట్లు స్పష్టమవుతోంది. సంరక్షణ కాదు.. అంతా ‘భక్షణే’ వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాల్లో 363 పనులు చేపట్టి రూ.228.33 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నా నాణ్యతను గాలికొదిలేశారు. రూ.8.67 లక్షలతో నాలుగు చెక్వాల్, మూడు సర్ఫేస్ స్టోరేజ్ పాండ్ పనులు చేపట్టగా.. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. గంజికుంటలో మూడు నిర్మాణాలకు రూ.10.03 లక్షలు, బోడిసానిపల్లిలో రెండింటికి రూ.62 వేలు, వజ్రకరూరులో నాలుగు నిర్మాణాలకు రూ.6.27 లక్షలు, రాగులపాడులో రెండింటికి రూ.3.78 లక్షలు, ఎన్‌ఎన్‌పీ తండాలో ఒక నిర్మాణానికి రూ.2.30 లక్షలు వెచ్చించారు. తట్రకల్లులో రెండు నిర్మాణాలు చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనట్లు పొందుపరిచారు. అయితే పర్క్యులేషన్ పనులు చాలా ప్రాంతాల్లో చేపట్టకుండానే నిధులు బొక్కేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల నిర్మాణాలు కన్పించకపోవడం గమనార్హం. ఇక వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి వంకకు పది మీటర్ల దూరంలో నిర్మించాల్సిన డగ్గౌట్ పాండ్ పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 73 డగ్గౌట్ పాండ్స్ నిర్మాణాలకు రూ.78.54 లక్షలకు పరిపాలన అనుమతి లభించగా.. 71 పనులు చేపట్టి కేవలం రూ.18.26 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ పనులు ప్రారంభించినట్లు నమోదు చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. గంజికుంటలో 19 నిర్మాణాలకు రూ.21.70 లక్షలతో పరిపాలన అనుమతి రాగా 18 పనులకు రూ.4.46 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలేసుకున్నారు. ఐడబ్ల్యూఎంపీ నిధులు కాకుండా ఉపాధి హామీ నిధులను ఖర్చు చేసినట్లు పేర్కొన్నా.. అవి స్థానిక నేతల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం డగ్గౌట్ పాండ్స్ నిర్మాణాల్లో తప్పనిసరిగా ఇన్లెట్, ఔట్లెట్ ఛానల్స్ ఉండాలి. కానీ ఇక్కడి నిర్మాణాల్లో అవేవీ కన్పించకపోవడం గమనార్హం. -
మందు గుండు పేలి.. యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): ఇబ్రహీంపట్నం శివారులోని ఓ చెక్‌డ్యాం వద్ద అడవి పంది కోసం పెట్టిన మందు గుండు పేలి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడు చత్తీస్గడ్కి చెందిన చందూలాల్(24)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు ప్రభుత్వం చిచ్చు పెడుతోంది
పళ్లిపట్టు: పాలారులో చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సోదర భావంతో ఉంటున్న తమిళం, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ అన్నారు. వేలూరు జిల్లా సరిహద్దు ఆంధ్రా ప్రాంతంలోని పాలారులో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం చెక్‌డ్యాంలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రభుత్వం తీరుతో తమిళనాడులోని వేలూరు, కాంచీపురం జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలతోపాటు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదమున్నందున చెక్‌డ్యాంల నిర్మాణానికి అన్ని పార్టీలు వ్యతిరేకత తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలో సోమవారం చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిరసనగా మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తమిళనాడులో ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో మెలగుతున్నారని, అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇరురాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. పాలారు నదిపై ఆధారపడి రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఆంధ్రా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో చెక్‌డ్యాంలు నిర్మించి తమిళనాడులోకి నీరు రాకుండా అడ్డుకుంటున్నట్లు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరితో రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే చెక్‌డ్యాంల నిర్మాణాన్ని నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని తెలిపారు. ఆంధ్రా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
చెక్ డ్యాంలో పడి బాలుడి మృతి
ఈతకు వె ళ్లిన పదేళ్ల బాలుడు చెక్ డ్యాంలో పడి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెత్సవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బి. రవికుమార్ స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి చెక్‌డ్యాం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్నేహితులు మృతదేహాన్ని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు. -
ఇంకిన చినుకులే సిరులు పంచాయి!
- చెక్ డ్యాంల నిర్మాణంతో కరువును జయించిన గిరిజన తండా - రెండేళ్లుగా సరైన వర్షాలు లేకున్నా జలసిరితో బావులు కళకళ - నీటి భద్రతతో ఏటా కొత్తగా 50 ఎకరాలు సాగులోకి.. కరువుకు చిరునామాగా నిలిచిన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామం అది. దశాబ్దం క్రితం వ్యవ సాయమనే ఊహకూ తావులేదు. ప్రస్తుతం జలసిరితో తుల తూగుతూ నాణ్యమైన సేంద్రియ పంట ఉత్పత్తులకు మారుపేరుగా నిలిచింది. ఊరు చుట్టూతా చెక్ డ్యాంల నిర్మాణంతోనే గ్రామం జీవకళను సంతరించుకుంది. వాన నీటిని భూగర్భంలో ఇంకించుకోవటంపై చూపిన శ్రద్ధే ఆ గ్రామానికి శాశ్వత నీటి భద్రతను సాధించిపెట్టింది. స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ఆ గిరిజన తండా వాసులు సమష్టి చైతన్య స్ఫూర్తితో సాధించిన ఈ విజయం.. కరువు పీడిత గ్రామాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం.. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ జల కళ ఉట్టిపడుతున్న గ్రామం గొల్లపల్లి తండా. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండోది అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోని తలుపుల మండలంలో ఉన్న ఆ తండాలో 130 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు బోర్లు వేసినా కరుణించని గంగ ఈ గ్రామంలో 15 అడుగుల లోతు బావుల్లోనే దర్శనమిచ్చి అచ్చెరువొందిస్తోంది. ఒక్క పంటను అదనులో సాగు చేయలేని కరువు కాలంలోనూ.. ఈ గ్రామంలోని రైతులు వివిధ రకాల పంటలను ఏడాదంతా సేంద్రియ విధానంలో సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. తొలి చెక్ డ్యాంతోనే దశ తిరిగింది.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో అనంతపురానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్వచ్ఛంద సంస్థ 2003లో గొల్లపల్లి తండాలో తొలి చెక్‌డ్యాంను నిర్మించింది. 2-7 కి. మీ. పరిధిలో కురిసిన వర్షపు నీరంతా చెక్ డ్యాంలోకి వ చ్చి చేరుతోంది. ఒక్కసారి నిండితే ఆరు నెలల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఒక్క వానకే చెక్‌డ్యాంలు నిండిన సందర్భాలున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు కొండల అంచుల వెంబడి అటవీ శాఖ సహాయంతో కందకాలను తవ్వుకున్నారు. బోరు బావుల వల్ల భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయంతో గ్రామ పరిధిలో బోర్లపై గ్రామ సంఘం నిషేధం విధించింది. చెక్‌డ్యాం నిర్మించిన తొలి ఏడాదే గ్రామంలో 9 బావులు తవ్వారు. 20 - 30 అడుగుల్లోనే సమృద్ధిగా నీరు లభించడంతో, ఆ ఏడాదే 20 ఎకరాల పొలం సాగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఏటా 40-50 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వస్తోంది. ఊటబావుల సంఖ్య క్రమంగా 83కు చేరింది. ఇప్పుడా గ్రామంలో 700 ఎకరాల భూమికి కరువు కాలంలోనూ సాగు నీటికి దిగుల్లేదు. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు తవ్వినా బోర్లలో నీరు పడటం లేదు. గొల్లపల్లితండాలో మాత్రం రోహిణి కార్తెలోనూ 15-20 అడుగుల లోతుగల బావుల్లోనే పుష్కలంగా నీరుంది. సేంద్రియ సేద్యపు బాట.. వాన నీటిని వొడిసిపట్టుకొని నీటి భద్రతను సాధించుకోవడంతోపాటు ఆ నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడంలోనూ గొల్లపల్లి తండా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆర్డీటీ సాయంతో ఊట బావుల వద్ద ప్రతి రైతూ ఒక సోలార్ మోటార్‌ను అమర్చుకున్నారు. అంతేకాదు.. సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో సేంద్రియ సేద్యపు బాట పట్టారు. 2009 నుంచి గొల్లపల్లితండాలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభమైంది. మామిడి, వేరుశనగ, వరి అక్కడ ప్రధానంగా సాగయ్యే పంటలు. వేసవిలో టమాటా, చిక్కుడు, మిరప, అనాస, సజ్జ, కొర్రలు వంటి పంటలు పండిస్తున్నారు. వరీ కంపోస్టు, పేడ ఎరువులు, వేపకషాయం, గోమూత్రంనే వాడుతున్నారు. సేంద్రియ మామిడికి రెండింతల ధర సేంద్రియ మామిడి పండ్లకు గొల్లపల్లి తండా ప్రసిద్ధి చెందినది. కాయ మంచి రంగు, నాణ్యత బావుండటంతో మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. బంగినపల్లి, అల్ఫాన్సా వంటి మామిడి రకాలకు స్థానికంగా లభించే ధరలతో పోల్చితే రెండింతల ధర లభిస్తోంది. వ్యాపారులే వచ్చి కొనుగోలు చే సి హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. విత్తన వేరుశనగ సాగులోనూ గొల్లపల్లి తండా పేరుగాంచింది. వ్యాపారులు రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర రాబట్టుకోవడం కోసం, మార్కెటింగ్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘాన్ని కూడా రైతులు ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇటు గొర్రెలు.. అటు ఆవులు.. గొల్లపల్లి తండా పశుసంపదతో తులతూగుతోంది. గ్రామంలో 7 వేల గొర్రెలు ఉన్నాయి. బళ్లారి, నెల్లూరు జాతి రకం గొర్రెలను రైతులు పెంచుతున్నారు. ఇవి మూడు నెలల్లోనే అమ్మకానికి వచ్చి.. ఒక్కో గొర్రెకు రూ. 3 వేల వరకు ధర లభిస్తుంది. మరోవైపు పాడి పరిశ్రమ వృద్ధి చెందింది. ఒక్కో కుటుంబానికి 10-20 వరకు ఆవులున్నాయి. 55 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఉన్నత విద్యనభ్యసించే యువకుల సంఖ్య పెరిగింది. ఈ పదిహేనేళ్లలోనే గ్రామం నుంచి 55 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందటం విశేషం. మారుమూల కొండల్లోని ఒక తండా ఇంత వృద్ధిలోకి రావడానికి మూలకారకుడు భూక్యా బాల గంగాధర్ నాయక్. ఆ గ్రామవాస్తవ్యుడైన నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉద్యోగం చేస్తూనే తండావాసులను వెలుగుబాటన నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాను 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచారాయన. చెక్‌డ్యాంలు, కందకాల నిర్మాణంతో కరువును జయించి, పాడి పంటలతో సుభిక్షంగా అలరారుతున్న గొల్లపల్లి తండా మరెన్నో కరువు పీడిత గ్రామాల్లో కొత్త వెలుగులకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిద్దాం. - చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, అనంతపురం జిల్లా సేంద్రియ సాగుతో అధికాదాయం! 2009 నుంచి మా గ్రామ రైతులందరూ సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. మేం పండించే పంటలన్నింటికీ గిరాకీ ఉంది. మంచి ఆదాయం లభిస్తోంది. నీటి భద్రత, సేంద్రియ సేద్యమే మా బలం. చెక్‌డ్యాంలు, బావుల నిర్మాణంతోనే నీటి భద్రత కల సాకారమైంది. - భూక్యా బాల గంగాధర్ నాయక్ (94408 74442), సేంద్రియ రైతు, గొల్లపల్లి తండా, తలుపుల మం., అనంతపురం జిల్లా చెక్ డ్యాంలతో రెండింతల నీటి సంరక్షణ 10 -20 అడుగుల లోతులోనే బావుల్లో నీళ్లున్న గ్రామం అనంతపురం జిల్లా మొత్తంలో గొల్లపల్లి తండా ఒక్కటే. దీనిక్కారణం చెక్‌డ్యాంల నిర్మాణమే. చెక్‌డ్యాంల వల్ల అంతకుముందుకన్నా రెండింతల నీరు భూమిలోకి ఇంకుతుంది. చెక్‌డ్యాం నుంచి నీరు భూమి పై పొరల్లోకి మాత్రమే ఇంకుతుంది. కాబట్టే 10 అడుగుల ఊట బావుల్లో నీరు ఉంటున్నది. బోర్లు వేస్తే ఫెయిలవుతాయి. పైగా ఉన్న ఆ కొద్దిపాటి భూగర్భ జలాలూ త్వరగా ఖర్చయిపోతాయి. అందుకే గొల్లపల్లి తండా రైతులెవరూ బోర్లు వేయకూడదని తీర్మానించుకొని దానిని కచ్చితంగా పాటిస్తున్నారు. - గోపిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి (98490 49096), డెరైక్టర్, ఆర్డీటీ ఎకాలజీ సెంటర్, అనంతపురం తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి! ఐదేళ్లుగా ఈ తండా రైతులు సేంద్రియ సేద్యం చేస్తున్నారు. వేరుశనగ రసాయనిక సేద్యం చేసే రైతుల కన్నా తక్కువ ఖర్చుతోనే ఎకరానికి 2, 3 బస్తాల అధిక దిగుబడి తీస్తున్నారు. భారీ వర్షాన్ని, సుదీర్ఘ బెట్టను సైతం పంటలు తట్టుకుంటున్నాయి. నాణ్యమైన విత్తనాలకు ఈ గ్రామం పెట్టింది పేరు. - కె. ఆదినారాయణ (94904 37796), సుస్థిర వ్యవసాయ కేంద్రం, కదిరి -
చెక్‌డ్యామ్‌ల ద్వారా వృథా నీటి నిల్వ
మంత్రి ఉమా విజయవాడ : సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని చెక్‌డ్యాం నిర్మాణాల ద్వారా నిల్వ చేయటానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన నిపుణుల కమిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజీ దిగువన పాత రైల్వే పిల్లర్స్ వద్ద యనమలకుదురు ఐల్యాండ్‌లో నీటి నిల్వ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. దీనిపై సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు నిర్మించబోయే చెక్‌డ్యాం నిర్మాణానికి, అప్రాన్కు ఎటువంటి నష్టం కలుగకుండా నిర్మాణం చేపట్టే విధంగా పరిశీలిస్తున్నామన్నారు. 2009లో వచ్చిన వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్లకు, అప్రాన్కు నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం బ్యారేజీ గేట్లు, అప్రాన్కు మరమ్మతులు నిర్విహ స్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని పుష్కరాల నాటికి విద్యుద్దీపాలతో అలంకరించి ఐకాన్‌గా నిలుపుతామన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీరు వై.ఎస్.సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీరు సి.రామకృష్ణ, నిపుణుల కమిటీ సభ్యులు ఐ.ఎస్.ఎన్.రాజు, చెరుకూరి వీరయ్య, రోశయ్య పాల్గొన్నారు. -
చెక్‌డ్యాంలో పడి తల్లి,కూతురు మృతి
ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీచెరువు మండలం మహ్మదాబాద్ క్రాస్ వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడిపోయి లక్ష్మీనరసమ్మ(40), భారతీ(20) అనే ఇద్దరు తల్లీకూతుళ్లు మృతిచెందారు. స్థానికులు గమనించి వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెక్ డ్యాం పనులకు పాకులాట
చెక్ డ్యాం కాంట్రాక్టుల కోసం టీడీపీ నేతల పాట్లు ఏడు బేసిన్లలో రూ.116 కోట్లతో పనులు దగ్గరుండి అంచనాలు సిద్ధం చేయించిన వైనం పరిశీలించేందుకు క మిటీ వేసిన కలెక్టర్ అనుమతుల మంజూరుకు సన్నాహాలు నీరు- చెట్టు పేరుతో ప్రభుత్వ ధనాన్ని అందిన కాడికి దోచేసిన అధికారపార్టీ నాయకులు ప్రస్తుతం చెక్‌డ్యాంలపై దృష్టిసారించారు. నీటి పారుదల శాఖ ప్రతిపాదించిన కాంట్రాక్టు పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పరిశీలనకు వచ్చే అధికారులకు సకల మర్యాదలు చేస్తూ.. కమీషన్ల ఆశ చూపుతూ, అవసరమైతే బెదిరిస్తూ అంచనాల స్థాయిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తమ్మీద డ్యాం.. స్కాంకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తిరుపతి: నీటి పారుదల శాఖలో కాంట్రాక్టు పనుల కోసం తెలుగు తమ్ముళ్లు పాకులాట మొదలుపెట్టారు. నీరు-చెట్టు పనులతో భారీగా లాభాలు రుచి మరిగిన చోటామోటా నాయకులు సైతం ఎలాగోలా పనులు దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతు పనుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నుంచి నీటిపారుదల శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విషయాన్ని పసిగట్టిన అధికారపార్టీ నేతలు అంచనాలను భారీగా పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని స్థానిక ఇంజనీర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పాలారు, చెయ్యేరు, పాపాఘ్ని, అరణియార్, స్వర్ణముఖి, కాళంగి, కుషావతి బేసిన్లో మరమ్మతులు చేయాల్సిన చెక్ డ్యాంలు 200లకు పైగా ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసి మరమ్మతులు చేయాల్సిన చెక్‌డ్యామ్‌లు 64 ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.22.01 కోట్లు. రూ.10 లక్షల లోపు ఖర్చు చేయాల్సినవి 131 ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.10.52 కోట్లు. మొత్తం రూ.32.54 కోట్ల తో అంచనాలు రూపొందించారు. ఇదే బేసిన్లలో కొత్త చెక్ డ్యామ్లకోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సిన 167 ఉన్నాయి. వాటి అంచనా రూ 49.55 కోట్లు, రూ.10 లక్షలకన్నా తక్కువ ఖర్చు చేయాల్సినవి 388 ఉన్నాయి వాటి విలువ రూ. 33.78 కోట్లుగా అంచనా వేశారు. అంటే చెక్‌డ్యాముల కోసం దాదాపు రూ.116 కోట్లతో అంచనాలు రూపొందించారు. పనుల పరిశీలనకు కమిటీ ఇంజనీర్లు, ఎన్జీవోలు, డ్వామాలోని ఇంజినీరింగ్ కన్సల్టెంట్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కమిటీ వేసి పరిశీలించాలని సూచించారు. వారంలోపు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పనుల అంచనాలను పెంచడం, అవసరం లేకున్నా చెక్ డ్యామ్‌ల ఏర్పాటు చేశారా? అనే దానిపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలి. ఈ నివేదిక ఆధారంగా పనులను ఖరారు చేయనున్నారు. -
నీటి వృథా అరికట్టేందుకు చర్యలు
కూడేరు: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు విడుదల చేసిన నీరు వృథా కాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కోనా శశిధర్ తెలిపారు. జల్లిపల్లి నుంచి కూడేరు వరకు గల 25 కిలో మీటర్లు పొడవు గల ధర్మవరం కుడికాలువ గుండా కలెక్టర్ పర్యటించి కాలువను పరిశీలించారు. 7.5 , 10, 12వ కిలో మీటర్ల వద్ద కాలువకు ఒక్క పక్క కొంత దూరం గోడను నిర్మించకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. ఎందుకు గోడ నిర్మించలేదు. ఇలాగైతే నీరు వృధా కాదా. వేగంగా నీరు ముందుకు ఎలా ప్రవస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలా గోడను నిర్మంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్ఎల్సీ అధికారులకు సూచించారు. 15వ కిలో మీటర్ వద్ద కలగళ్ళకు చెందిన రైతులు గోపాల్, ప్రభాకర్, నారాయణలు కలెక్టర్‌ను కలిశారు. కుడికాలువ కింద తగ్గు భాగంలో తమ పొలాలు ఉన్నాయని , కాలువకు నీరు విడుదల చేసినపుడు నీరు లీకై పొలంలోకి రావడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తమ పంటలను కాపాడాలని విన్నవించుకున్నారు. చెరువులన్నింటికీ నీరందించడమే లక్ష్యం : 112 కిలోమీటర్లు పొడవునా గల కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ విలేకరులకు తెలిపారు. ధర్మవరం కుడి కాలువకు గత ఏడాది రోజు సుమారు 700 క్యూసెక్కులు వరకు నీరు విడుదల చేస్తే లీకేజీల వల్ల ధర్మవరం చెరువుకు వెళ్లే సరికి 300 క్యూసెక్కులే మిగిలేవన్నారు. ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్‌తో అత్యవసర ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటిని విడుదల చేసినపుడు హెచ్చెల్సీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేస్తు పక్కా ప్రణాళికతో నీరు వృధా కాకుండా ముందుకు సాగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు. ఈఈ మగ్బుల్ బాషా, డీఈఈ ఏడు కొండలు, డీఈలు శ్రీధర్, మరళి, రమణ, మూర్తి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, డీపీఆర్ఓ జయమ్మ, ఆత్మకూరు ఎస్ఐ , ఏఎస్ఐ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల ఎంపికకు కసరత్తు
నర్సాపూర్ : చెరువుల పునరుద్ధరణ లో భాగంగా మొదటి విడత ఎంపిక కోసం అధికారులు కసరత్తును ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సాగు నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు చెందిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు మొత్తం 1,612 ఉండగా వాటిలో 1,182 చెరువులు, కుంటలు సాగునీటి పారుదల శాఖకు చెందినవిగా రికార్డులు పేర్కొంటున్నాయి. సాగు నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, కుంటల్లో 20 శాతం చెరువులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా అందులో భాగంగా ఆరు మండలాలకు చెందిన సుమారు 259 చెరువులను మొదటి సంవత్సరం పునరుద్ధరించాలని నిర్ణయించి అందులో మొదటి విడత కోసం 60 చెరువులు ఎంపిక చేయనున్నారు. ఏ మండలంలో ఎన్ని చెరువులంటే.. నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో 39 చెరువులు, హత్నూరలో 57, కౌడిపల్లిలో 55, శివ్వంపేటలో 48, కొల్చారంలో 20, వెల్దుర్తి మండలంలో 40 చెరువులు, కుంటలను ఎంపిక చేస్తారు. కాగా వీటిలో మొదటి దశ కింద మండలానికి పది చెరువులు, కుంటలను కలిపి పునరుద్ధరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నేతృత్వంలో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎంపిక చేయనున్నారు. సంపూర్ణంగా మరమ్మతులు పునరుద్ధరణ కింద ఎంపిక చేసిన చెరువులు, కుంటలను సంపూర్ణంగా మరమ్మతులు చేపడతారు. చెరువులు, కుంటల్లో పూడికను తీసి మట్టిని రైతులకు అందజేస్తారు. మట్టిని ప్రభుత్వ ఖర్చులతో వాహనాల్లో నింపితే రైతులు తమ ఖర్చులతో తమ తమ పొలాల్లోకి తరలించుకోవాల్సి ఉంటుంది. కాగా చెరువుల కట్టలను వెడల్పు, అలుగులు, తూములను మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే పునర్నిర్మాణం పనులు చేపడతారు. చెరువుల మరమ్మతులకు అంచనాల నివేదికల ఆధారంగా నిధులు కేటాయించనున్నారు. డిసెంబర్లో పునరుద్ధరణ పనులు చెరువుల పునరుద్ధరణ పనులను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను స్థానిక అధికారులు సిద్ధం చేయగానే ఉన్నతాధికారులు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. -
కళ్ల ముందే కర్ణాటకకు!
తాండూరు: వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. యేటా కాగ్నానది పొంగిపొర్లడం.. ఆ జలాలు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతుండడం సాధారణమై పోయింది. భారీ వర్షాలు పడిన సమయంలో నీటి వరద పక్క రాష్ట్రానికి తరలిపోకుండా ‘చెక్’ పెట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరద నీటి వల్ల తాండూరు ప్రాంతానికి ఏ ప్రయోజనమూ ఉండడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కాగ్నాలోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద నీటిని వినియోగంలోకి తెస్తే వేలాది ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. తాండూరు పట్టణంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలోని 33 గ్రామాలకూ తాగునీటిని అందించొచ్చు. చెక్‌డ్యాం నిర్మాణమెప్పుడో..! కాగ్నా వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలని గతంలో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఏడాది క్రితం రూ.8.52కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాం నిర్మాణ స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. నదిలో చెక్‌డ్యాం నిర్మిస్తే నది చుట్టుపక్కల ఉన్న సుమారు 400 బోర్లకు పుష్కలంగా నీరు చేరుతుంది. తద్వారా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే వీలుంది. ప్రతిపాదిత చెక్‌డ్యాం నిర్మిస్తే 250-300 మీటర్ల పొడవున 0.35 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంటుంది. దాంతో భూగర్భజలాలు వృద్ధి చెంది భవిష్యత్తులో కరువు తలెత్తినా సాగు, తాగునీటికి సమస్య ఉత్పన్నం కాదు. కర్ణాటకకు ఇలా.. వర్షాకాలంలో కాగ్నా నుంచి తరలిపోతున్న వరద నీటిని కర్ణాటక సద్వినియోగం చేసుకుంటోంది. జలాలు బషీరాబాద్ మండలం ఇందర్చేడ్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తాయి. వరద నీరు ప్రవహించే మార్గంలో అక్కడక్కడ చిన్నచిన్న డ్యామ్‌లు సైతం నిర్మించారు. ఆ రాష్ట్రంలోని కోహెడ్, సేడం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న చెరువులు నింపడం, కాలువల ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. 1.9టీఎంసీల నీరు కర్ణాటక? వర్షాకాలంలో సుమారు 1.9 టీఎంసీ వరదనీరు కాగ్నా నుంచి కర్ణాటకకు తరలిపోతున్నదని సాగునీటి పారుదల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ వరద జలాలు అందుబాటులోకి తెవొచ్చని, దాంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.50కోట్ల నిధులు మంజూరైనా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాగ్నాలో చెక్‌డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు. కానీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు మొదలు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
మట్టి పరీక్షలతోనే సరి!
తాండూరు: కాగ్నా నది (వాగు)లో చెక్‌డ్యాం నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. చెక్‌డ్యాం గురించి ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచి కాగ్నా వరద జలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ కనబరచడం లేదనే విషయం స్పష్టమవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణానికి 2013 మార్చిలో సుమారు రూ.8.52 కోట్ల నిధులు (అడ్మిస్ట్రేషన్ సాంక్షన్) మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో సుమారు 35 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తాయి. దాంతో కాగ్నా వరద జలాలు వినియోగంలోకి వచ్చి తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌లోని సుమారు 39 గ్రామాలతో, తాండూరు పట్టణ వాసులకు తాగునీటి కష్టాలు తీరుతాయి. కాగ్నాకు చుట్టుపక్కల సుమారు 750 ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతోనే చెక్‌డ్యాం పనులు మొదలవడానికి ఆలస్యమవుతోంది. గత ఏడాది చివరిలోనే చెక్‌డ్యాం నిర్మించనున్న ప్రాంతంలో ‘సాయిల్ బేరింగ్ కెపాసిటీ’ (ఎస్బీసీ)లో భాగంగా మట్టి పరీక్షలు నిర్వహించారు. చెక్‌డ్యాం నిర్మాణానికి కాగ్నా సమీపంలోని యాలాల మండల పరిధిలో ఒకటిరెండు గ్రామాల్లో దాదాపు 5ఎకరాల 2గుంటల భూమిని సేకరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. నిధుల సాంకేతిక మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటం కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చెక్‌డ్యాం నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి పనులు మొదలయ్యేలా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
వాగులు ఖాళీ
జిల్లాలో డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోని దుందుబీ వాగు పరి వాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది. ఇప్పటికే వందల మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటి పోయా యి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాల వృద్ధికి నేషనల్ వాటర్‌షెడ్, డీపీఏపీ వాటర్‌షెడ్, నీ రుమీరు, ఈజీఎస్, డీఎఫ్ఐడీ తదితర పథకాల ద్వారా వ్యవసాయ పొలాల్లో వాలుకట్టలు, చెక్‌డ్యామ్‌లు, గల్లీకంట్రోల్, ల్యాండ్ లెవలింగ్, ఊటకుంటలు, ఫాంపండ్లు, ఇం కుడుగుంతలు, వంటి పనులు చేపట్టడంతోపాటు దాదాపు వంద కోట్ల నిధులను వెచ్చించి బాలానగర్ మండలం మొదలుకుని జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీ వాగుపై భారీ చెక్‌డ్యామ్‌లను ని ర్మించారు. ఇన్ని చేసినా ఇసుక తరలింపుతో లక్ష్యం బూడిలో పోసిన పన్నీరులా మారుతోంది. ఇదీ సంగతి.. వివిధ ప్రభుత్వ పనుల నిర్మాణాలకు కొన్ని క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక అవసరముం దంటూ అధికారుల నుంచి కాంట్రాక్టర్లు అ నుమతులు తీసుకుంటున్నారు. తర్వాత ని బంధనలను పక్కనపెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు వాగులవంక చూడకపోవడంతో రే యింబవళ్లు ఇష్టానుసారంగా యంత్రాల సా యంతో వాగును తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్య లారీల్లో ఇసుక పట్టణ ప్రాం తాలకు తరలుతోంది. ఈ వ్యవహారంలో తలదూర్చకూడదని అధికారులు, నాయకులు, చివరికి మీడియా ప్రతినిధుల అండదండలు తీసుకోవడానికి గురువారం రాత్రి జడ్చర్లలోని ఓ త్రీస్టార్ హోటల్లో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చిన్నవాగులూ మటుమాయం పాన్‌గల్ మండలం తెల్లరాళ్ళపల్లి, చిక్కేపల్లి, బొల్లారం, వల్లభాపూర్, రాయినిపల్లి గ్రామాల్లోని చిన్నవాగులు, చెరువులు మటుమాయమవుతున్నాయి. ఈ గ్రామాల మీదుగా నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయా గ్రామాల రైతులు, యువకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేసినా సరే.. చూస్తాం.. వస్తాం.. అంటూ పట్టించుకోవడంలేదు. ఒకవేళ దాడికి వచ్చినా ముందస్తు సమాచారం ఉండటంతో ట్రాక్టర్ల యజమానులు అధికారులు వచ్చేసరికి పరారవుతున్నారు. మస్తు ఫిర్యాదులిచ్చినం వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, మా బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు రైతులందరం కలిసి మస్తుసార్లు ఫిర్యాదులు చేసినం. ఎవరూ పట్టించుకుంటలేరు. - చిన్నయ్య, రైతు, తెల్లరాళ్లపల్లి కేసులు పెట్టాలి మేం పట్టుకుంటం. కానీ లా భం లేకుండా పోతుంది. పో లీసులు గట్టి కేసులు పెడితే ఈ దందా ఆగిపోతది. మేం చెబితే ట్రాక్టర్ యజమానులకు మాకు గొడవలు జరుగుతున్నాయి. అందుకే అధికారులే దాడులు చేయాలి. - బాల్యానాయక్, గిరిజనసంఘం నాయకులు పట్టించుకుంటాం మండలంలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్లను చాలాసార్లు పట్టుకొని జరిమానా విధిం చాం. డంపింగ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తాం. - ధన్వాల్, తహశీల్దార్, పాన్‌గల్ పంటపొలాల్లో డంపింగ్ ఉదయం వేళ ట్రాక్టర్లు, మినీ వ్యాన్లలో వ్యవసాయ పొలాలు, పండ్ల తోటల్లో వాగుల నుంచి ఇసుకను తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారికి ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలను చూయిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకొని దాడులు చేస్తేగాని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేరని వాగు పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు. -
ఇంటికి చేరుకోక ముందే..
సిర్పూర్(టి), న్యూస్‌లైన్ : సిర్పూర్(టి) మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దుర్గం దేవిప్రసాద్(12), దుర్గం విద్యాసాగర్(13) నాగమ్మ చెరువు చెక్ డ్యాంలో పడి ఆదివారం సాయంత్రం మృతిచెందారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన దేవిప్రసాద్, విద్యాసాగర్ ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవుకావడంతో సరదాగా స్నానం చేయడానికి ఇద్దరు కలిసి పాఠశాల వెనుకాల ఉన్న చెక్‌డ్యాంకు స్నానానికి వెళ్లారు. దేవిప్రసాద్, విద్యాసాగర్ చెక్‌డ్యాం ఒడ్డున స్నానం చేస్తూ లోతైన ప్రాంతానికి వెళ్లి మునిగారు. బహిర్భూమికని వెళ్లిన యశ్వంత్ వీరు మునిగిపోవడాన్ని గమనించి తోటి విద్యార్థులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే జీవన్, ప్రవీణ్, సంతోష్ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని చెక్‌డ్యాంలో గాలించి విద్యార్థులను బయటికి తీశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిన్నంటిన రోదనలు విద్యార్థులు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని మృతదేహాలపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇద్దరు విద్యార్థులు కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన వారు కావడంతో విద్యార్థుల తల్లితండ్రులు ఆదివారం మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి విద్యార్థులను కలిశారు. భోజనం చేసిన అనంతరం యోగక్షేమాలు కనుక్కుని ఇంటికి బయలుదేరారు. తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేలోపే వీరి కొడుకులు చనిపోయారనే వార్త తెలిసింది. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. రాము-శ్యామలకు ఒక కూతురితోపాటు దేవిప్రసాద్ ఒక్కడే కుమారుడు. వీరు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో విషాదంలో మునిగారు. భగవాన్- పుష్పలకు ముగ్గురు కూతుళ్లు, విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు అన్నివిధాల అండగా ఉంటాడనుకుంటే అర్ధాంతరంగా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాల వద్ద తల్లితండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. మృతదేహాలతో రోడ్డుపై ధర్నా సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై విద్యార్థుల శవాలతో పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడీషనల్ ఎస్సై సుధాకర్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్లు స్థానికంగా ఉండక పోవడంతో విద్యార్థులకు ఎలాంటి అడ్డం లేకుండా ఉందని, దీంతోనే విద్యార్థులు పాఠశాల పక్కన ఉన్న వాగులో, సమీపంలో ఉన్న చెక్‌డ్యాంకు వెళ్లున్నారని తల్లిదండ్రులు వాపోయారు.