సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని చెక్‌డ్యాం నిర్మాణాల ద్వారా నిల్వ చేయటానికి సాధ్యాసాధ్యాలను...
మంత్రి ఉమా
విజయవాడ : సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని చెక్‌డ్యాం నిర్మాణాల ద్వారా నిల్వ చేయటానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన నిపుణుల కమిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజీ దిగువన పాత రైల్వే పిల్లర్స్ వద్ద యనమలకుదురు ఐల్యాండ్‌లో నీటి నిల్వ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. దీనిపై సీఎంకు నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు నిర్మించబోయే చెక్‌డ్యాం నిర్మాణానికి, అప్రాన్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా నిర్మాణం చేపట్టే విధంగా పరిశీలిస్తున్నామన్నారు.
2009లో వచ్చిన వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్లకు, అప్రాన్‌కు నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం బ్యారేజీ గేట్లు, అప్రాన్‌కు మరమ్మతులు నిర్విహ స్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని పుష్కరాల నాటికి విద్యుద్దీపాలతో అలంకరించి ఐకాన్‌గా నిలుపుతామన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీరు వై.ఎస్.సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీరు సి.రామకృష్ణ, నిపుణుల కమిటీ సభ్యులు ఐ.ఎస్.ఎన్.రాజు, చెరుకూరి వీరయ్య, రోశయ్య పాల్గొన్నారు.