కరోనా విలయానికి చేతివృతుల సడుగులు విరిగిపోయాయి. చేతివృతులపై ఆధారపడి జీవిస్తున్న వారందరిపై కోవిడ్ పిడుగులా పడింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశమంతా కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. సముద్ర మార్గాల్లో ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ నుంచి కొలంబో పోర్ట్‌కు వెళ్తున్న సరకు రవాణా నౌక ప్రమాదానికి గురైంది.
1/11
ఇది ఖమ్మం వెంకటేశ్వరనగర్ ప్రభుత్వాస్పత్రి.. మంగళవారం రెండో డోస్ కోసం జనం వందలాదిగా బారులు తీరారు.. తీరా చూస్తే.. కేవలం వంద మందికే టోకెన్లు ఇవ్వడంతో చేసేది లేక.. ఉసూరుమంటూ వెనుదిరిగారు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం
2/11
హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో కొలిమి ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిజామాబాద్‌కు చెందిన పద్మ, చందు దంపతులు. కోవిడ్ కల్లోలంతో వీరి జీవనం అల్లోకల్లోలమయింది.
3/11
లాక్‌డౌన్ అమలు తీరును హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ చెక్‌పోస్ట్ వద్ద పర్యవేక్షిస్తున్న తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
4/11
బంగారు దుకాణాలు, ఫర్టిలైజర్ దుకాణాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ సయ్యద్ మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చూపిస్తున్న డీసీపీ వేంకటేశ్వర్లు
5/11
హైదరాబాద్ కింగ్‌కోఠి ఆస్పత్రిలో వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్వేతా మహంతి. ఎవరికి ఎంత ఆక్సిజన్ ఇస్తున్నారో ఇక నుంచి లెక్క చెప్పాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
6/11
హైదరాబాద్: కోవిడ్ బాధితులకు ప్రాణవాయువు అందించే కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 23 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలనుంచి 14 ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 1,200 టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు చేరవేసింది. మంగళవారం వచ్చిన 14వ రైలు 53 టన్నుల ఆక్సిజన్‌ను మోసుకొచ్చింది. ఇప్పటివరకు 70 ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ను ఒడిశా, జార్ఖండ్, గుజరాత్‌ల నుంచి తెచ్చింది.
7/11
ఢిల్లీ సరిహద్దుల్లోని తిక్రి వద్ద మంగళవారం ఆందోళనల్లో పాల్గొన్న రైతులు. కేంద్ర తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నిరసనలు ప్రారంభించి ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన బ్లాక్ డేగా పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
8/11
గుజరాత్ నుంచి కొలంబో పోర్ట్‌కు వెళ్తున్న సరకు రవాణా నౌక ‘ఎక్స్‌ప్రెస్ పెర్ల్’ కొలంబో సమీప తీరప్రాంతంలో అగ్నికి ఆహుతవుతోన్న దృశ్యం. భారత్, రష్యా, ఫిలిప్పీన్స్, చైనాలకు చెందిన 25 మంది సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా కాపాడారు.
9/11
లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో మంగళవారం నిర్మానుష్యంగా కనిపిస్తున్న కరాడ్‌లోని పుణే–బెంగళూర్ జాతీయ రహదారి
10/11
మంగళవారం ముంబైలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా కోసం క్యూలో నిల్చున్న జనం
11/11
బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మంగళవారం ముంబైలోని ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ బాధితుడికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు
Comments
Please login to add a commentAdd a comment