కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి అత్యవసరమైనవి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్లు. అందుకే వీటిని ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నాయి. విజయవాడ మధురానగర్ నేతాజీ కాలనీలోని డైమండ్ మెడికల్ సెంటర్‌లో పీపీఈ కిట్లను తయారు చేస్తున్న సిబ్బందిని చిత్రంలో చూడొచ్చు.
– సాక్షి, ఫొటోగ్రాఫర్, విజయవాడ
1/8
హెల్మెట్లు పాడైపోయాయనుకోండి.. ఎవరైనా ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు చెత్త బుట్టలో పడేస్తారంటారా? సాధారణంగా ఎవరైనా చేసేది అదే కానీ.. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించి వాటిని కూడా ఆకట్టుకునేలా వినియోగిస్తున్నాడు. తన నివాసంలో హెల్మెట్లను వేలాడదీసి వాటిలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు. ఆ మార్గంలో వెళ్లేవారికి ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
2/8
విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ మండల ప్రాంతంలో మొక్కజొన్న పంటను వేసేందుకు రైతులు మొక్కజొన్న విత్తనాలను ఎండబెడుతున్నారు. కుమిలి రోడ్డులో ఒక పొలంలో మొక్కజొన్నలను ఆరబెడుతున్న రైతు ఆదిబాబు.
3/8
సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం గుట్ట కిందనే ఉన్న చెరువులో కమలం పూలు విరబూసాయి. దీంతో చెరువంతా గులాబీమయంగా కనువిందు చేస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సూర్యాపేట
4/8
ఒకే చోట పిల్లలందరూ కలిసి ఊగుతున్న ఉయ్యాల ఆటలు చూస్తుంటే ఎవరికైనా చిన్ననాటి ఆటలు గుర్తు రావాల్సిందే... పెద్దపల్లి శివారు అప్పన్నపేటలో రాజీవ్‌రహదారి వెంట వలస కుటుంబాలకు చెందిన పిల్లలు ఇలా చెట్టుకు చీరలను కట్టి ఉయ్యాల ఆటల్లో చిన్నారుల కేరింతలు సాక్షి కెమెరాకు కనిపించారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, పెద్దపల్లి
5/8
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
6/8
కోవిడ్ బాధితురాలి పరిస్థితి విషమించడంతో బంధువులకు ఫోన్‌లో వివరిస్తూ ఆందోళన చెందుతున్న మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆస్పత్రి వెలుపల కనిపించిన దృశ్యమిది.
7/8
ఢిల్లీలోని కామన్‌వెల్త్ గేమ్స్ విలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది
8/8
కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో సోమవారం ముంబైలోని వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వైద్యునితో ఓ మహిళ వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment