Photo Feature: ఏరువాక సందడి.. మొబైల్‌ వ్యాక్సినేషన్‌ | Local to Global Photo Feature in Telugu: Eruvaka Purnima, Nagali, Vat Savitri | Sakshi
Sakshi News home page

Photo Feature: ఏరువాక సందడి.. మొబైల్‌ వ్యాక్సినేషన్‌

Published Fri, Jun 25 2021 6:17 PM | Last Updated on Fri, Jun 25 2021 6:17 PM

Local to Global Photo Feature in Telugu: Eruvaka Purnima, Nagali, Vat Savitri - Sakshi

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఉపసంహరించడంతో నగరాల్లో వాహనాల రద్దీ పెరిగి మళ్లీ కాలుష్యం ఎక్కువ అవుతోంది. ఏరువాక పున్నమి సందర్భంగా గురువారం అన్నదాతలు సంప్రదాయబద్దంగా పొలం పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్నాన్‌ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పూరీలోని జగన్నాథుని ఆలయంలో ఉత్సవమూర్తులకు జలాభిషేకం చేశారు. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్‌లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌తో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/10

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కర్షకులు పశువులకు పూజలు చేశారు. సాగులో చేదోడువాదోడుగా ఉండే ఎద్దులు, ఆవులు, బర్రెలను అలంకరించారు. మధ్యాహ్నం హలం పట్టి పొలం దున్నారు. సాయంత్రం వేళ ఎడ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించారు. సంగారెడ్డి కొత్లాపూర్‌లో ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు.

2
2/10

ఏరువాక పౌర్ణమి రోజున నల్లగొండలో పూజానంతరం దుక్కి దున్నుతున్న రైతు

3
3/10

ఏరువాక పౌర్ణమి నేపథ్యంలో ఖమ్మంలో అరకకు హారతిపట్టి పూజలు చేస్తున్న రైతు, కుటుంబసభ్యులు

4
4/10

లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో హైదరాబాద్‌ నగరంలో రద్దీ పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాలతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

5
5/10

కోవిడ్‌ వాక్సినేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ మొబైల్‌ వాక్సినేషన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పలు రైతు బజార్లు, చౌరస్తాలలో ప్రజలకు టీకాలు వేసింది.

6
6/10

త్రిపురలోని ధర్మనగర్‌కు చెందిన నరోత్పల్‌ సింగ్‌ తను సాగు చేసిన పెద్ద సైజు పుట్టగొడుగులను చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న దృశ్యం

7
7/10

లాక్‌డౌన్‌ ఆంక్షలతో గురువారం నిర్మానుష్యంగా కనిపిస్తున్న నవీముంబైలోని ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌ వే

8
8/10

పూరీలోని జగన్నాథుని ఆలయంలో గురువారం దేవస్నాన్‌ పూర్ణిమను పురస్కరించుకుని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్న పూజారులు

9
9/10

ముంబై: వట సావిత్రి పూర్ణిమ పండుగ సందర్భంగా భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ మర్రిచెట్టుకు దారం కడుతున్న ఓ మహిళా పోలీసు

10
10/10

తిరుచ్చిలో కొత్తగా నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌లో స్థానిక జంబుకేశ్వర్‌ అఖిలాండేశ్వరి ఆలయ ఏనుగు అఖిలకు స్నానం చేయిస్తున్న ఓ భక్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement