Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి | Local to Global Photo Feature in Telugu: Cyclone Yaas, Milky Way, Farmers Protest | Sakshi
Sakshi News home page

Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి

Published Thu, May 27 2021 4:43 PM | Last Updated on Thu, May 27 2021 5:00 PM

Local to Global Photo Feature in Telugu: Cyclone Yaas, Milky Way, Farmers Protest - Sakshi

‘యాస్‌’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవ​స్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన  ప్రదర్శనలు నిర్వహించారు. ఇ​క.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/11

పాలపుంత చిత్రం సూపర్‌ కదూ.. దీన్ని న్యూజిలాండ్‌లోని తరనాకి పర్వతం వద్ద తీశారు. ఈ చిత్రాన్ని తీయడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని ఫొటోగ్రాఫర్‌ లారిన్‌ రే చెప్పారు. పెనుగాలులను తట్టుకుంటూ నాలుగు గంటలు కష్టపడి.. తరనాకిని అనుకుని ఉన్న అగ్నిపర్వతం ఫాంథమ్‌ పీక్‌కు చేరుకున్నానని.. అప్పుడీ సుందర దృశ్యం కెమెరా కంటికి చిక్కిందని తెలిపారు. అందుకే అన్నారు.. కష్టేఫలి అని..

2
2/11

ముంబైలో కనిపించిన సూపర్‌ మూన్‌. (2021లో ఈ బుధవారమే చంద్రగ్రహణం సంభవించగా భారత్‌లో మాత్రం కనిపించలేదు)

3
3/11

‘యాస్‌’ తుపాన్‌ పెను గాలులు, భారీ వర్షాలతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్, టెలీకాం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి.

4
4/11

విత్తనాలు సమకూర్చుకోవడం అన్నదాతలకు ప్రయాస అవుతోంది. రోహిణీ కార్తె ప్రవేశించడంతో వానాకాలం పనులకు శ్రీకారం చుడుతున్నారు. భూసారం పెంచే జీలుగ, పెద్ద జనుము విత్తనాలు కొనేందుకు ఎదురుచూస్తున్నారు. కామారెడ్డి మండలంలో విత్తనాలు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాటు చేయగా, వందలాది మంది రైతులు బుధవారం తెల్లవారుజామునే వచ్చి వరుస కట్టారు. అధికారులు వచ్చేసరికి చాంతాడంత క్యూ తయారైంది. దీంతో పోలీసు పహారాలో విత్తనాలు పంపిణీ చేశారు.

5
5/11

నూతన సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి 6 నెలలు పూర్తయిన సందర్భంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారు.

6
6/11

తెలంగాణలో పలు డిమాండ్లతో జూనియర్‌ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్న జూనియర్‌ డాక్టర్లు.

7
7/11

ముంబైలో బుధవారం వాహనంలోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వృద్ధులు

8
8/11

బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుధవారం నాగ్‌పూర్‌లోని గౌతమబుద్ధుడి విగ్రహం వద్ద ప్రార్థన చేస్తున్న బౌద్ధులు

9
9/11

చెక్కపెట్టెలో కనిపిస్తున్న ఈ పుచ్చకాయలు ఖరీదైన యుబేరీ రకానికి చెందినవి. మార్కెట్‌ తొలిసీజన్‌ సందర్భంగా జపాన్‌లోని సప్పోరో సిటీలోని సెంట్రల్‌ టోకుమార్కెట్‌లో వేలంవేయగా ఏకంగా దాదాపు రూ.18.17లక్షల(25వేల డాలర్ల) ధర పలికాయి.

10
10/11

సిరియా అధ్యక్ష ఎన్నికలను పురస్కరించుకుని బుధవారం రాజధాని డమాస్కస్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వరసలో నిల్చున్న యువత

11
11/11

కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ హైదరాబాద్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. ఎంజే మార్కెట్‌ సమీపంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌ పాల్గొ​న్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement