Milky Way
-
అంతరిక్షంలో బంగారం!
వాషింగ్టన్: మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్ 1.5 మీటర్ టెలిస్కోప్ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు. అధ్యయనం ఫలితాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్ స్టార్ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. -
నక్షత్రాల సమూహం.. ఆర్ఆర్ లైర్.. ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో
వాషింగ్టన్: మన పాలపుంతలో అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రాల సమూహాన్ని తాజాగా గుర్తించారు. ఆర్ఆర్ లైర్గా పిలుస్తున్న ఈ తారలు పాలపుంత చివరి అంచుల్లో, మనకు అతి సమీపంలో ఉన్న నక్షత్ర మండలమైన ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో ఉండటం విశేషం! ఇప్పటిదాకా కనీసం ఇలాంటి 200 నక్షత్రాలను గుర్తించారు. వీటిల్లో అత్యంత దూరాన ఉన్న నక్షత్రమైతే భూమి నుంచి ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! ఆండ్రోమెడా నక్షత్ర మండలం భూమి నుంచి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్న సంగతి తెలిసిందే. మిగతా విశ్వంలో మాదిరిగా పాలపుంత చివరి అంచుల్లో అత్యధిక భాగం డార్క్ మ్యాటర్‌తోనే నిండి ఉంటుంది. విశ్వపు మౌలిక నిర్మాణానికి ఆధారం ఇదేనని భావిస్తారు. దీని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే అంతరిక్షంలోని దృగ్గోచర ద్రవ్యరాశి ఒక్కచోటికి చేరి తారలు, తారా మండలాలు పుట్టుకొస్తాయన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ పరిశోధన వల్ల పాలపుంత ఆవలి హద్దుల్లో ఏముందనే దానిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని దీనిలో భాగం పంచుకున్న యూసీ శాంతాక్రుజ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రొఫెసర్ రాజగుహ ఠాకూర్త చెబుతున్నారు. -
‘ఆపాత’ పాలపుంతలు!
వాషింగ్టన్: అచ్చం మన పాలపుంత మాదిరిగా ఉండే నక్షత్ర మండలాలను నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. ఇవన్నీ విశ్వం ప్రస్తుత వయసులో కేవలం మూడో వంతు ఉన్నప్పుడు, అంటే దాదాపు 1,100 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డాయట! ఈ క్రమంలో విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలాన్ని కూడా జేమ్స్ వెబ్ గుర్తించింది. అది ఏకంగా 1,350 కోట్ల ఏళ్లనాటిదట. అప్పటికి విశ్వం ఆవిర్భవించి కేవలం 30 కోట్ల ఏళ్లేనట! ఈ నక్షత్ర మండలాల కేంద్ర స్థానం నుంచి ఇతర నక్షత్ర రాశుల దాకా విస్తరించి ఉన్న స్టెల్లర్ బార్స్‌ను కూడా వీటిలో గమనించడం విశేషం. ఈ బార్స్ మన పాలపుంతలోనూ ఉన్నాయి. అయితే విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లో ఇవి కన్పించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రద్ధా జోగీ అన్నారు. ఈ నేపథ్యంలో నక్షత్ర మండలాల పుట్టుక, వికాసాలను గురించిన సిద్ధాంతాలను సరిచూసుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నక్షత్ర మండలాలను గతంలో హబుల్ టెలిస్కోప్ కూడా గుర్తించినా వాటిలో ఈ బార్స్ కనిపించలేదన్నారు. ‘‘ఇవి నక్షత్రాలతో పాటు అంతరిక్ష ధూళి, వాయువుల కదలికలను ప్రభావితం చేయడంతో పాటు తారల పుట్టుక ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ సాయపడతాయి. అంతేగాక నక్షత్ర మండలాల కేంద్ర స్థానాల్లో అతి భారీ కృష్ణబిలాల పుట్టుకకూ దోహదం చేస్తుంటాయి. ఒకవిధంగా ఇవి నక్షత్ర మండలాల్లో సరఫరా వ్యవస్థ పాత్ర పోషిస్తుంటాయి. విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లోని స్టెల్లర్ బార్స్‌పై తొలిసారిగా పరిశోధన చేస్తున్నది మేమే. ఇది ఇప్పటిదాకా ఎవరూ చూడని కీకారణ్యంలోకి తొలిసారి అడుగు పెట్టడం వంటిదే’’ అంటూ శ్రద్ధా ముక్తాయించారు. -
పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత
పాలపుంత చిత్రాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డెరెక్, కొలరాడోలోని మరూన్ బెల్స్ పర్వతాల వద్ద తీశాడు. ఇంతకీ మానసిక చింతకు పాలపుంతకు కనెక్షన్ ఏమిటి అనే కదా మీ డౌట్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డెరెక్‌కు ఈ నక్షత్రాలే ఓదార్పునిచ్చాయట. డెరెక్‌కు ఆస్ట్రోఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది కాదట. 20 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత వ్యాధి వల్ల గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడేవాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడేవి. అలాంటి టైంలో వాటి నుంచి బయటపడటానికి, మనసును వేరేపని మీద లగ్నం చేయడానికి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆసక్తి పెరిగింది. తర్వాత ఓ రోజు తన కెమెరాను పట్టుకుని.. పాలపుంతల చిత్రాలను తీయడానికి బయల్దేరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రోఫొటోగ్రాఫర్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదీ చదవండి: LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి.. -
అదో అధోజగత్తు.. శ్మశానసదృశ ప్రాంతం.. మృతప్రాయ నక్షత్రాల అడ్డా!
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట! -
Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి
‘యాస్’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
పరి పరిశోధన
జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు కొత్త మార్గం! వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మనలో అందరికీ ఎదురయ్యే సమస్యే. గుండెపోటుకు గురైనవారు లేదా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడినవారికీ అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఈ సమస్యలకు ఇప్పటివరకూ కచ్చితమైన పరిష్కారాలు లేవు. అయితే వేక్‌ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల తాజా ప్రయోగాల పుణ్యమా అని ఇకపై మాత్రం అవసరమైనప్పుడు మెదడు పనితీరును సూపర్ చార్జ్ చేసుకునేందుకు వీలేర్పడనుంది. ఎలాగంటారా? చాలా సింపుల్. కంప్యూటర్లలో ర్యామ్ పెంచుకున్నట్లే మన మెదడులోనూ ఓ చిప్లాంటిది ఉంచుకుంటే సరి అంటున్నారు రాబర్ట్ హాంప్సన్ అనే శాస్త్రవేత్త. ఇలాంటి పరికరాన్ని తాము ఇప్పటికే తయారు చేశామని.. ఇటీవలే కొందరి మెదళ్లలో ఈ పరికరాన్ని అమర్చి విజయవంతంగా పరీక్షలు కూడా పూర్తి చేశామని రాబర్ట్ తెలిపారు. అటు షార్ట్ టర్మ్ మెమరీతోపాటు, ఇటు లాంగ్‌టర్మ్ మెమరీ కూడా ఈ పరికరం ద్వారా మెరుగుపడినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని చెప్పారు. వీడియోగేమ్‌లు ఆడుతున్న కొందరి మెదళ్లను పరిశీలిస్తూ.. హిప్పోకాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు ఏ పద్ధతిలో చైతన్యవంతం అవుతున్నాయో గుర్తించి అదే పద్ధతిలో పనిచేసే పరికరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. మరిన్ని పరిశోధనలతో ఈ పరికరాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్కువ జ్ఞాపకశక్తిని అందించే యంత్రాల తయారీకి వీలేర్పడుతుందని హాంప్సన్ తెలిపారు. నిద్రలేమి.. ఒత్తిళ్లతో ఊబకాయం! వేళాపాళా లేని తిండి, నిద్ర, రకరకాల ఒత్తిళ్లు... ఆరోగ్యానికి చేటని, బరువు పెరిగేందుకూ కారణమవుతాయనీ తెలుసు. అయితే స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా ఇందుకు గల కారణాలను స్పష్టంగా తెలుసుకోగలిగారు. మన శరీరంలో ఒక పద్ధతి ప్రకారం హెచ్చుతగ్గులకు గురయ్యే గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్లతో ఈ చిక్కులన్నీ వస్తున్నాయని వీరు అంటున్నారు. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ కూడా గ్లూకో కార్టికాయిడ్ హార్మోన్ కావడం గమనార్హం. సాధారణంగా ఈ హార్మోన్లు ఒక రోజులో గరిష్టస్థాయికి చేరి... తగ్గిపోతూంటాయి. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతితక్కువగా... ఉదయం 8 గంటలకు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, ఒత్తిడి లేదంటే కొన్నిరకాల మందుల ద్వారా అప్పుడప్పుడూ ఈ హార్మోన్ కొద్ది సమయం పాటు ఎక్కువవుతూంటుంది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే అది కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపి ఈ హార్మోన్లు 12 గంటల్లోపు అత్యధిక, అత్యల్ప స్థాయిలకు చేరుకుంటే కొవ్వు కణాలు తొందరగా జీర్ణమవుతాయని గుర్తించారు. ఎలుకలకు ఈ హార్మోన్‌ను అందించినప్పుడు సహజమైన ప్రక్రియకు విఘాతం కలిగి కొవ్వు రెట్టింపు అయిందని తెలిసింది. ఈ పరిశోధన బరువు నియంత్రణకు ఉపయోగపడుతుందని అంచనా. పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు సౌరకుటుంబంతోపాటు కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలకు నెలవైన మన పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు ఉన్నట్లు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలపుంత మధ్యలో సాగిట్టారిస్ పేరుతో అత్యంత భారీ కృష్ణబిలం ఉందని చాలాకాలంగా తెలుసు. అయితే దీన్ని గుర్తించేందుకు ఉపయోగించిన పద్ధతిలో కొన్ని మార్పులు చేసి పరిశీలించినప్పుడు ఆ భారీ కృష్ణబిలం పరిసరాల్లో కొన్ని వేల సంఖ్యలో కృష్ణబిలాలు ఉన్నట్లుగా తెలిసింది. ఇంత పెద్దస్థాయిలో కృష్ణబిలాలను ప్రత్యక్షంగా గుర్తించడం ఇదే తొలిసారి. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ ఖగోళశాస్త్రవేత్తలు చేపట్టారు. భారీ కృష్ణబిలం మింగేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు బుల్లి కృష్ణబిలాలు పొరుగునే ఉండే నక్షత్రాలతో లంకె ఏర్పరచుకుంటాయని ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎక్స్‌రే కిరణాలు వెలువడతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛక్ హేలీ తెలిపారు. అయితే పాలపుంత మధ్యలో ఉండే భారీ కృష్ణబిలం చాలా దూరంగా ఉంది కాబట్టి.. ఎక్స్ కిరణాలను చూడటం సాధ్యం కాదని చెప్పారు. అందువల్ల తాము చంద్ర వేధశాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఎక్స్‌రే కిరణాలను గుర్తించి భారీ కృష్ణబిలం చుట్టూ చిన్న సైజులో ఉన్నవి పదివేల వరకూ ఉన్నట్లు గుర్తించామని వివరించారు. -
అతి భారీ కృష్ణబిలం!
టోక్యో: మన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కంటే దాదాపు లక్ష రెట్లు ఎక్కువ పరిమాణాన్ని ఇది కలిగి ఉంటుందని తెలిపారు. ఇది మన పాలపుంత కేంద్ర భాగంలో ఉన్న విష వాయువుల సమూహం వెనుక దాక్కుని ఉందన్నారు. మన గెలాక్సీలోని ‘సాజిటేరియస్ ఏ’ అనే కృష్ణ బిలం ఇప్పటివరకు అత్యంత పెద్దది. అయితే, ప్రస్తుతం కనుగొన్న ఈ కృష్ణబిలం రెండో అతిపెద్దది అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. మన పాలపుంత కేంద్ర భాగానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కృష్ణబిలం ఉంది. ఇది దాదాపు 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణబిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయి. -
పాలపుంత కంటే కాంతివంతం
లండన్: మన పాలపుంత కంటే 1000 రెట్లు అధిక కాంతివంతమైన నక్షత్ర మండ లాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ సుమారు 10 వేల మిలియన్ కాంతి సంవ త్సరాల దూరంలో నిక్షిప్తమై ఉందని తెలిపారు. అత్యంత కాంతివంతమైన ఈ గెలా క్సీ చాలా బలమైన పరారుణ కిరణాలను ప్రసారం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ కార్టాజీనా (యూపీసీ టీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం సైజు, ఇంటెన్సిటీని ఎక్కువగా చేసి చూపించే గ్రావిటేషనల్ లెన్స్‌లను ఉపయోగించి దీని జాడ కనుగొన్నారు. దీని జాడ కోసం పరిశోధకులు ఆకాశం మొత్తాన్ని జల్లెడ పట్టడంతోపాటు వివిధ ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ గెలాక్సీలో అత్యంత వేగంగా నక్షత్రాలు ఉద్భవి స్తున్నాయని పరిశోధకులు డియాజ్ సాన్చెజ్ తెలిపారు. దీనిలోని అణువు లపై అధ్యయనం చేస్తామని ప్రకటించారు. -
పాలపుంత సైజులో కొత్త గెలాక్సీ!
వాషింగ్టన్: మన పాలపుంత పరిమాణంలో ఉన్న భారీ గెలాక్సీ (నక్షత్ర సమూహం)ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీ మొత్తం కృష్ణపదార్థంతో తయారైందని భావిస్తున్నారు. డ్రాగన్ ఫ్లై-44 అని పిలుస్తున్న ఈ గెలాక్సీ ‘కోమా’ నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉంది. ఇందులో అక్కడక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హవాయిలోని డబ్ల్యూఎం కెక్ నక్షత్ర శాల, జెమినీ నార్త్ టెలీస్కోప్‌ల సాయంతో గుర్తించారు. దాదాపు 6 రాత్రుల పాటు పరిశీలించి డ్రాగన్ ఫ్లై-44లోని నక్షత్రాల వేగాన్ని (వెలాసిటీ) కొలిచారు. ఈ గెలాక్సీ మధ్య భాగం చుట్టూ ఉన్న గోళాకార నక్షత్రాల సమూహపు వెలుతురు భాగం.. మన పాలపుంత చుట్టూ ఉన్న వెలుతురు భాగం మాదిరిగానే ఉన్నట్లు గుర్తించారు. నక్షత్రాల వేగం గెలాక్సీ పదార్థాన్ని సూచిస్తుందని, నక్షత్రాలు ఎక్కువ వేగంగా కదిలితే గెలాక్సీ పదార్థం కూడా అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
పాలపుంతలో భారీ అగాథం!
భూమిపై ఎడారులు ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే.. అయితే అంతరిక్షంలోనూ ఎడారులు ఉంటాయా.. ఎడారిని పోలిన ప్రాంతం ఒకటి ఉందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు తేల్చారు. భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యభాగంలో భారీ అగాథం ఉందని, నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శకలాలు ఏవీ ఈ ప్రాంతంలో లేవని గుర్తించారు. ఈ ప్రాంతం దాదాపు 8వేల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని జపాన్, దక్షిణాఫ్రికా, ఇటలీలకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నక్షత్రమూ, గ్రహమూ కొత్తగా ఏర్పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాలపుంత మధ్య భాంలో దాదాపు 150 కాంతి సంవత్సరాల వ్యాసం పరిధిలో కోటి నుంచి 30 కోట్ల సంవత్సరాల వయసున్న నక్షత్రాలు ఉన్నా... ఆ ప్రాంతం తరువాత ఈ నక్షత్ర ఎడారి ప్రాంతం విస్తరించి ఉందని సౌతాఫ్రికన్ లార్జ్ టెలిస్కోపు ద్వారా తాము జరిపిన పరిశీలనల ద్వారా ఇది స్పష్టమైందని వారు అంటున్నారు. -
ఆ చాక్లెట్లలో ప్లాస్టిక్ ..
అంతర్జాతీయ చాక్లెట్ కంపెనీ మార్స్ ఉత్పత్తుల్లో రెడ్ ప్లాస్టిక్ పదార్థం లభించడం కలకలం రేపుతోంది. గత నెల 8న జర్మనీలో ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన స్నిక్కర్స్ బార్ చాక్లెట్లో రెడ్ ప్లాస్టిక్ లభించడంతో.. మార్స్ పెద్ద ఎత్తున మార్కెట్ నుంచి తన ఉత్పత్తులను ఉపసంహరించుకుంటోంది. దాదాపు 55 దేశాల్లో తన చాక్లెట్ ఉత్పత్తులను ఈ కంపెనీ మార్కెట్ నుంచి వెనుకకు తీసుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో కంపెనీకి వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనున్నట్టు భావిస్తున్నారు. జర్మనీ వ్యక్తి తాను కొన్న స్నికర్స్ చాక్లెట్లో రెడ్ ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించి వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేశాడు. నెదర్లాండ్ వేఘేల్లోని ఫ్యాక్టరీలో తయారైన ఈ చాక్లెట్లో ప్లాస్టిక్ కలిసినట్టు కంపెనీ గుర్తించింది. తయారీ ప్రక్రియలో భాగంగా రక్షణ కోసం ఉపయోగించే కవర్‌కు చెందిన ప్లాస్టిక్ పదార్థం చాక్లెట్లో కలిసినట్టు గుర్తించారు. దీంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున మార్స్ తన చాక్లెట్ ఉత్పత్తులను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటోంది. మార్స్‌కు సంబంధించిన మిల్కీ వే, స్నిక్కర్స్, సెలబ్రేషన్స్, మినీ మిక్స్ వంటి ఉత్పత్తులపై ఈ ప్రభావం పడినట్టు కంపెనీ మంగళవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. వినియోగదారులు కొనుగోలు చేసే చాక్లెట్లలో రెడ్ ప్లాస్టిక్ పదార్ధం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుజాగ్రత్త చర్యగా వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తోంది. యూఏఈలో నిషేధం ప్రజారోగ్యం దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (యూఏఈ)లో మార్స్ కంపెనీ చాక్లెట్లపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. మార్స్‌కు సంబంధించిన మిల్కీ వే, స్నిక్కర్స్, సెలబ్రేషన్స్, మినీ మిక్స్ వంటి చాక్లెట్లపై నిషేధం విధించినట్టు యూఏఈ పర్యావరణ, వాతావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నెదర్లాండ్‌కు చెందిన మార్స్ కంపెనీ స్వచ్ఛందంగా మార్కెట్ నుంచి తన చాక్లెట్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. -
పాలపుంత.. ఆకాశమంత..
రాత్రి వేళ ఇంద్రధనస్సు విరిసినట్లు కనిపిస్తున్న ఈ పాలపుంత ఫొటో అదిరిపోయింది కదూ.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డేవ్ లేన్ తీశారు. ఇలాంటి చిత్రాలు తీయడమంటే మాటలు కాదు. డేవ్ గంటలతరబడి వేచి చూసి.. ఈ అరుదైన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని ఆయన అక్కడి ఆర్చెస్ జాతీయ పార్కులో తీశారు. -
పాలపుంత ఫొటో అదిరింది కదూ!
రాత్రి వేళ ఇంద్రధనుస్సు విరిసినట్లు కనిపిస్తున్న ఈ పాలపుంత ఫొటో అదిరిపోయింది కదూ.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డేవ్ లేన్ తీశారు. ఇలాంటి చిత్రాలు తీయడమంటే మాటలు కాదు. డేవ్ గంటల తరబడి వేచి చూసి.. ఈ అరుదైన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని ఆయన అక్కడి ఆర్చెస్ జాతీయ పార్కులో తీశారు. -
పాలపుంత ఏర్పాటే భిన్నం!
లండన్: విశ్వంలోని నక్షత్ర సమూహా (గెలాక్సీలు)ల్లో ప్రకాశవంతంగా ఉండే మన పాలపుంత (మిల్కీవే).. మిగతావాటికి భిన్నంగా లోపలివైపు నుంచే మెల్లమెల్లగా ఏర్పడిందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జియా-ఈఎస్‌వో ప్రాజెక్టు నుంచి సేకరించిన సమాచారం సహాయంతో.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతరిక్ష విభాగం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడిన తొలి నక్షత్రాల్లో ఎక్కువ శాతం హైడ్రోజన్, హీలియం మూలకాలు మాత్రమే ఉన్నాయని.. ఆ తర్వాతి కాలపు నక్షత్రాల్లో మెగ్నీషియం వంటి లోహ మూలకాలు ఉంటాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మరియా బెర్జ్ మన్ చెప్పారు. ప్రస్తుతం పాలపుంతలోని నక్షత్రాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా... మన సూర్యుడి కక్ష్యా ప్రాంతమైన మధ్య భాగంలో ఉన్నవాటిలో లోహమూలకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అంచులకు వెళ్లినకొద్దీ లోహ మూలకాల పరిమాణం పెరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ముందుగా ఏర్పడ్డాయని, అనంతరం అంచులవైపు నక్షత్రాలు ఏర్పడుతూ పాలపుంత విస్తరించిందని తెలిపారు. అంతేగాకుండా.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ఏర్పడడానికి తక్కువకాలం పడుతోందని, అదే అంచులవైపు నక్షత్రాలు ఏర్పడడానికి సుదీర్ఘ కాలం పడుతోందని పేర్కొన్నారు.