పాలపుంత కంటే కాంతివంతం
లండన్: మన పాలపుంత కంటే 1000 రెట్లు అధిక కాంతివంతమైన నక్షత్ర మండ లాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ సుమారు 10 వేల మిలియన్ కాంతి సంవ త్సరాల దూరంలో నిక్షిప్తమై ఉందని తెలిపారు. అత్యంత కాంతివంతమైన ఈ గెలా క్సీ చాలా బలమైన పరారుణ కిరణాలను ప్రసారం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ కార్టాజీనా (యూపీసీ టీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం సైజు, ఇంటెన్సిటీని ఎక్కువగా చేసి చూపించే గ్రావిటేషనల్ లెన్స్‌లను ఉపయోగించి దీని జాడ కనుగొన్నారు. దీని జాడ కోసం పరిశోధకులు ఆకాశం మొత్తాన్ని జల్లెడ పట్టడంతోపాటు వివిధ ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ గెలాక్సీలో అత్యంత వేగంగా నక్షత్రాలు ఉద్భవి స్తున్నాయని పరిశోధకులు డియాజ్ సాన్‌చెజ్ తెలిపారు. దీనిలోని అణువు లపై అధ్యయనం చేస్తామని ప్రకటించారు.