పాలపుంత ఫొటో అదిరింది కదూ!
రాత్రి వేళ ఇంద్రధనుస్సు విరిసినట్లు కనిపిస్తున్న ఈ పాలపుంత ఫొటో అదిరిపోయింది కదూ.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డేవ్ లేన్ తీశారు. ఇలాంటి చిత్రాలు తీయడమంటే మాటలు కాదు. డేవ్ గంటల తరబడి వేచి చూసి.. ఈ అరుదైన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ చిత్రాన్ని ఆయన అక్కడి ఆర్చెస్ జాతీయ పార్కులో తీశారు.