సాక్షి, నిజామాబాద్: వేసవి విడిదికి వచ్చి, మూడు నెలల పాటు స్థానికులను అలరించిన విదేశీ పక్షులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి మార్చిలో ఆఫ్రికా నుంచి ఫ్లెమింగో, పెలికాన్, పెయింటెడ్ స్టోర్క్ తదితర రకాల పక్షులు వస్తాయి. ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలతో జూన్ నెలలో స్వస్థలాలకు వెళ్లిపోతాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్‌పల్లి గ్రామ శివారులో గురువారం విదేశీ పక్షుల సందడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment