flamingo
-
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
విదేశాల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్!
సాక్షి,బరంపురం: చిలికా సరస్సుకు ప్రతీ ఏడాది మాదిరిగానే విదేశీ పక్షులు వచ్చి చేరుతున్నాయి.తమ జాతి పక్షులతో జతకట్టేందుకు చిలికా దీవుల్లో విడిదిని ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా చలి ఎక్కువై లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సుకు చేరుతున్నాయి. విదేశీ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చిలికా వన్యప్రాణి అభివృధ్ధి సంస్థ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటుచేశారు. ( చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా? ) మూడు వారాలుగా సుమారు 8.94 లక్షల విదేశీ పక్షులు సరస్సుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంతానానికి శ్రీకారం రకరకాల విదేశీ పక్షులు చిలికా సరస్సు మధ్యన ఉన్న బరుకుల్, నల్లబాల, కాళీజై, సత్తపరా, బ్రేక్పాస్టు, శరణ్, చోడైహోగా, మంగళాజోడి, పరికుద్ దీవులకు లక్షల సంఖ్యలో చేరుకొని విడిదిని ఏర్పర్చుకున్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పును మనుషులతో పాటు పక్షులు కూడా తెలుసుకుంటాయనడానికి.. చలికాలంలో చిలికా సరస్సుకి లక్షలాది పక్షులు రావడమే నిదర్శనం. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గూడు కట్టుకొని తమ జాతి పక్షులతో జతకలిసి సంతాన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాయి. చదవండి: లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు.. -
Photo Story: రెడీ టు టేకాఫ్
సాక్షి, నిజామాబాద్: వేసవి విడిదికి వచ్చి, మూడు నెలల పాటు స్థానికులను అలరించిన విదేశీ పక్షులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి మార్చిలో ఆఫ్రికా నుంచి ఫ్లెమింగో, పెలికాన్, పెయింటెడ్ స్టోర్క్ తదితర రకాల పక్షులు వస్తాయి. ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలతో జూన్ నెలలో స్వస్థలాలకు వెళ్లిపోతాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూత్పల్లి గ్రామ శివారులో గురువారం విదేశీ పక్షుల సందడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
అద్భుతం: గుండుసూదిపై ఫ్లెమింగో
సాక్షి, యలమంచిలి రూరల్ (విశాఖపట్నం): ఏటికొప్పాక హస్తకళాకారుడు మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎస్.చిన్నయాచారి గుండుసూదిపై ఫ్లెమింగో పక్షి బొమ్మను రూపొందించారు. దీన్ని తయారు చేసేందుకు రాగి తీగలు, చెక్క ఉపయోగించి మూడు రోజులపాటు శ్రమించినట్లు ఆయన వివరించారు. పొడవు 4.80, వెడల్పు 1.75 ఎంఎం సైజులో తయారు చేసిన పక్షి రూపాన్ని పుటాకార దర్పణంతో వీక్షించేలా తయారు చేశారు. వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దీన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఏటికొప్పాక కళాకారులు చిన్నయాచారిని అభినందించారు. చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..! -
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
2వ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్
-
ఫ్లెమింగో ఫెస్టివల్‌పై అవగాహనకు 2కే రన్
నెల్లూరు: ఫ్లెమింగో ఫెస్టివల్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కే రన్ విజయవంతం అయింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పురస్కరించుకొని బుధవారం ఉదయం నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో 2 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతుథులుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్ జానకి తదితరులు హాజరయ్యారు.