
రామప్ప ఆలయం సోమవారం రాత్రి త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఆలయానికి మూడు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో ఆ గొప్ప కట్టడం కాంతులీనింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడ జాతీయజెండాను ఆవిష్కరించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు పురావస్తుశాఖ అ«ధికారులు తెలిపారు.
– వెంకటాపురం(ఎం), ములుగు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment