సాధారణంగా మంచు తెల్లగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు ఎర్రని రక్తం రంగులోకి మారింది. అది చూసేవారికి భయం గొలిపేలా ఉంది. ఈ ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద దర్శనమిచ్చింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారినట్టు తెలుస్తోంది. ఈ ఎరుపు రంగులో ఉన్న మంచుకు సంబంధించిన ఫోటోలను ఓ ట్విటర్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘షాక్‌కు గురి చేసే విధంగా ఎరుపు రంగులోకి మారిన అంటార్కిటికా మంచు.. వాతావరణ మార్పులు అరిష్టం అనే సంకేతాన్ని ఇస్తోంది. మంచుతో నిండిన ఈ ఖండం చట్టూ వాతావరణం వేడెక్కుతోంది’ అంటూ కాప్షన్ పెట్టారు.
ఈ చిత్రాలను ఉక్రెయిన్ దేశ విద్యా, విజ్ఞాన మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంటార్కిటికా ఖండంలోని మంచు.. వేసవి కాలం ఆరంభ సమయంలో మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఎరుపు రంగులో ఉన్న మంచు చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై ‘అంటార్కిటికాలో ‘బ్లడ్ ఫాల్స్’ అనే నది ఉంది. ఇది క్రమం తప్పకుండా ఎర్రటి ద్రవంతో ప్రవహిస్తోంది. తెల్లని మంచుకు రక్త స్రావం అవుతున్నట్లు కనిపిస్తోంది. అది చల్లగా ఉంటుందా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఎరుపు రంగులోకి మారుతున్న మంచు
భయం గొలిపే ఎరుపు రంగు మంచు!
Published Sat, Feb 29 2020 6:37 PM | Last Updated on Sat, Feb 29 2020 6:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment