చంపేస్తోంది! | Kills! | Sakshi
Sakshi News home page

చంపేస్తోంది!

Published Wed, Jan 14 2015 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

Kills!

మరిపెడ/కొత్తగూడ/రేగొండ : ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు.. అనూహ్యంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జిల్లావాసులు గజగజలాడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వారం, పది రోజులుగా చలి, తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నారుు. మూడు రోజుల వ్యవధిలో జిల్లా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోరుుంది. ఈ నెల 7, 8వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 30.. కనిష్ట ఉష్ణోగ్రత 15 నమోదైంది.

తొమ్మిదో తేదీన గరిష్టం 29 కా గా, కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గి 12కు చేరుకుంది. పదో తేదీన కనిష్ట స్థారుు ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. సోమవారం ఇదే రీతిన కొనసాగగా.. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. సుమారు వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుండడంతో చలి విపరీతంగా పెరిగింది. దీంతో వృద్ధులు మరణాల బారిన పడుతుండగా... పిల్లలు, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటి వర కు పదుల సంఖ్యలో వృద్ధులు మృతి చెందారు. గత నెల 23న చలి తీవ్రతను తట్టుకోలేక కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన నలుగురు పాపమ్మ (75), పూసపాటి ఉప్పల య్య (68), ముదిగిరి కొమురయ్య (70), గాడిపల్లి ఖాసిం (85) ఒకే రోజు మృత్యువాత పడ్డా రు.

ఇదే క్రమంలో రోజుకు ఒకరిద్దరు చలితో ప్రాణాలొదలగా.. మంగళవారం తాజాగా మరి పెడ మండలంలోని వీరా రం గ్రామానికి చెందిన అల్లి మల్లమ్మ(80), కొ త్తగూడ మండలంలోని వేలుబెల్లి చిర్ర సమ్మక్క(67), రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కుచన రాజకనకయ్య (90) మృత్యువాత పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement