స్నోయగం
గొలుగొండ: ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంచు కురిసింది. ఉదయం దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు లైట్లు సహాయంతో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో మంచు కురవడంతో పలువురు వింతఅనుభూతికి లోనయ్యారు. ఉదయం నర్సీంగబిల్లి, జానికిరాంపురం, ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో ఈ మంచు ప్రభావం కనిపించింది.