
PhotoCredit: AP
మాస్కో: రష్యాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉరల్ పర్వతాలు, సైబీరియా ప్రాంతాల్లో మంచు కరిగి నదుల్లోకి చేరడం వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. కజకిస్తాన్ సరిహద్దులోని ఒరెన్‌బర్గ్ ప్రాంతం వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ 10వేల ఇళ్ల దాకా నీటిలో మునిగాయి.
పశ్చిమ సైబీరియాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఉరల్ నది ప్రమాదకర స్థాయిలలో ప్రవహిస్తోంది. దీంతో నది తీర ప్రాంతాల్లో ఉండే వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ నది ఒరెన్‌బర్గ్ మీదుగా కజకిస్తాన్ వెళుతుంది. సమీపంలోని డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒర్‌స్క్ నగరం పూర్తిగా నీటిమయమైంది.
ఇదీ చదవండి.. దైవ కణం ఉందన్న శాస్త్రవేత్త కన్నుమూశాడు