మంచులో కుక్క విన్యాసాలు.. వీడియో వైరల్‌ | Dog plays In Snow In Adorable viral Video | Sakshi
Sakshi News home page

మంచులో కుక్క విన్యాసాలు.. వీడియో వైరల్‌

Published Sat, Dec 26 2020 12:43 PM | Last Updated on Sat, Dec 26 2020 12:48 PM

Dog plays In Snow In Adorable viral Video - Sakshi

సాధారణంగా కుక్కలకు మంచు అంటే చాలా ఇష్టం. మంచును చూస్తే అవి ఉత్సాహంతో ఉరకలేస్తాయి. వాటికి ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తాయి. మంచుపై అవి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో ప్రకారం.. మంచుతో కప్పబడిన సుందరమైన ప్రాంతాన్ని చూసిన ఓ బొచ్చు కుక్క.. ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా కలియతిరిగింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ... మంచులో బొర్లాడింది. జారుడు బల్లపై జారినట్లు.. మంచుపై పడుకొని కిందికి జారింది. కుక్క చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ అరుదైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 57000 వ్యూస్‌, 4000 లైకులు వచ్చాయి. ‘కుక్క వీడియోలతో ఇదొక అద్భుత వీడియో, ఈ వీడియో చూస్తే నాకు చక్కిలిగింతలు పెట్టినట్లు అవుతుంది, ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేక పోతున్నాను’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement