ఎడారిలో మంచు కురిసింది! | fell Of snow in the desert! | Sakshi
Sakshi News home page

ఎడారిలో మంచు కురిసింది!

Published Sun, Dec 4 2016 3:02 AM | Last Updated on Tue, Aug 21 2018 3:10 PM

ఎడారిలో మంచు కురిసింది! - Sakshi

ఎడారిలో మంచు కురిసింది!

గల్ఫ్ దేశాలు అంటే ఎవరికై నా ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి ఎడారులే. కానీ, ఇప్పుడు మాత్రం అక్కడి ఎడారులన్నీ తెల్లటి మంచుతో మెరిసిపోతున్నాయి. జనం ఏసీలు వేసుకోడానికి బదులు రూం హీటర్లు పెట్టుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్తే ఎప్పుడూ లేనట్లుగా స్వెటర్లు, మఫ్లర్లు లాంటి దుస్తులతో వెళ్లాల్సి వస్తోంది. ఆరు బయట కురుస్తున్న మంచుతో అమెరికా లాంటి దేశాల్లో కనబడే ’’స్నోమాన్’’ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోయాయి. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి.

సాధారణంగా ఇక్కడ అక్టోబర్ వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఇప్పటికీ అక్కడ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ శీతాకాలంలో ఇంత పెద్ద ఎత్తున మంచు పడటం ఉండదు. దాంతో ఇప్పుడు కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్నోమాన్ బొమ్మలు చేసి వాటితో సెల్ఫీలు దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement