నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.
⇒ మంచు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న హెర్నన్ బృందం
సంగం: నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు లాస్‌గ్రాట్స్ అనే ప్రాంతానికి మృతదేహాన్ని చేర్చాల్సి ఉంది. అయితే మంచు కారణంగా రోడ్డు కూడా కనపడని పరిస్థితి నెలకొనడంతో హెర్నన్ బృందం ముందుకు సాగేందుకు అవాంతరం ఏర్పడుతోంది. దీంతో ప్రస్తుతానికి బృందం గుహల వద్దకు వెనక్కు వెళ్లింది.