malli mastan babu
-
చెప్పిందొకటి, చేస్తోంది మరొకటి
పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి అన్యాయం అప్పట్లో ఐదెకరాలు ఇస్తామని, ఇప్పుడు రెండెకరాలు ఇచ్చిన ప్రభుత్వం అధికారులను నిలదీసిన మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ సంగం: ఖండాంతరాల్లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన ప్రముఖ పర్వతారోహకుడు, దివంగత మల్లిమస్తాన్‌బాబు కుంటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మస్తాన్‌బాబు మృతి చెందినపుడు ఆయన తల్లి సుబ్బమ్మకు ఐదు ఎకరాల సాగుభూమి ఇస్తామని అప్పట్లో రాష్ట్ర మంత్రులు, అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడు రెండెకరాలు ఇస్తున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో సోమవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులు ప్రకటించారు. దీనిపై మస్తాన్‌బాబు తల్లి ఆవేదన చెందారు. తన కుమారుడు మస్తాన్‌బాబు మృతి చెందినపుడు రాష్ట్ర మంత్రులు, అధికారులు తనకు ఐదెకరాలు సాగుభూమి, రూ. 10 వేల పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెండెకరాలు ఇవ్వడం ఏమిటని జన్మభూమిలో అధికారులను ఆమె నిలదీశారు. అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తుందేమిటి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రెండెకరాల భూమిని సుబ్బమ్మకు ఇస్తున్నట్లు సభలో పట్టాను చూపిన తహశీల్దార్.. ఆమెకు మాత్రం పట్టా అందజేయలేదు. ఆర్డీవో ఎంవీ రమణ ద్వారా పట్టా ఇప్పిస్తామని తొలుత అధికారులు తెలిపారు. ఆర్డీవో సభకు రాకపోవడంతో పట్టాను ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లి సుబ్బమ్మకు పట్టా ఇచ్చే విషయంలో కూడా అధికారులు ప్రచారం కోరుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. -
సహకారం అందిస్తాం
కొరుక్కుపేట:ప్రవాస తెలుగువారి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రాఘనాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతాల్లో మృ+తి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున వెళ్లిన ఆయన చెన్నైకు రావటంతో చెన్నై పురి ట్రస్ట్ ఆహ్వానం మేరకు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. చెన్నపురి ట్రస్ట్ నిర్వాహకులు తంగుటూరి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పల్లె రఘనాథరెడ్డి పాల్గొన్నారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్యలో తెలుగు భవన్‌ను నిర్మించనున్నామని తెలిపారు. స్వచ్ఛమైన సంప్రదాయ భావాలు కలిగిన తెలుగు భవన్ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తెలుగు ప్రముఖులు, చెన్నపురి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పొన్నూరు రంగనాయకులు, ఎం.వి.నారాయణగుప్త, తంగుటూరి రామకృష్ణలు తమిళనాడులో తెలుగువారి సమస్యలు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం గ్రాంట్ల సమస్యలు చెన్నైలోని తెలుగు జర్నలిస్టు సమస్యలను పల్లెరఘనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన మస్తాన్‌బాబు ఉన్నత విద్యలను చదివి సత్యం కంప్యూటర్లో మంచి హోదాలో పని చేశారని అన్నారు. జాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు మస్తాన్‌బాబు కావటం విశేషం. దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతాల్లో ఎక్కుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఇతనికి జాతీయ నాయకులు ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు చేశామన్నారు. తెలుగు మాట్లాడేవారు 18 కోట్లమంది ఉన్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం బయట గాని, విదేశాలలో గాని ఉన్న తెలుగు వారు తెలుగు భాషా సంస్కృతులపై చూపుతున్న అభిమానం అనన్యసామాన్యమైనదని అన్నారు. రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటున్న తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తెలుగు ప్రాచీన వైభవాన్ని, నైతిక విలువలను, సమాజం పట్ల అవగాహన దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఆ దిశగా తెలుగు పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని వివరించారు. తెలుగు భాషకు ఇతోధికంగా సేవలందించే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుందన్నారు. ఆ దిశగా జాతి నాయకులు ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, గురజాడ, గిడుగు, అల్లూరి సీతారామరాజు, బాపు లాంటి మహోన్నత వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి భాషా సమస్యలను పరిష్కరించే విధంగా తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లనున్నామన్నారు. పొట్టి శ్రీరాములు స్మారక మందిరానికి పెంచిన గ్రాంటును అందేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు నేర్పించే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. చెన్నైలోని తెలుగు జర్నలిస్టులకు హెల్త్ కార్డులను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ నిర్మాత కందేటి సత్యనారాయణ, మిర్చి వ్యాపారవేత్త జి ఆర్ రమేష్, ఇజ్రాయేల్, కె ఎల్ శ్రీనివాస్, గుర్రం చంద్రశేఖర్, పొన్నూరు రంగనాయకులు, రవిబాబు, టీడీపీ స్థానిక నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు -
స్వగ్రామానికి చేరుకున్న మస్తాన్ బాబు మృతదేహం
-
ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు
ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామమైన గాంధీ జనసంఘానికి చేరుకుంది. ఆయన మృతదేహాన్ని నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు మస్తాన్ బాబు ఇంటికి వెల్లువెత్తారు. శనివారం నాడు ఆయన స్వగ్రామంలోనే పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు తదితరులు శుక్రవారం సాయంత్రమే వెళ్లి మస్తాన్‌బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. అర్జెంటీనాలోని పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రమాదవశాత్తు మంచులో కూరుకుపోయి మస్తాన్‌బాబు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని బయటకు తీసేందుకు అర్జెంటీనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత సాధ్యం కాకపోయినా.. తర్వాత జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి వెంటనే భారతదేశానికి పంపారు. చెన్నై విమానాశ్రయం నుంచి సంగం మండలంలోని గాంధీ జనసంఘానికి మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు. -
కాసేపట్లో స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం
నెల్లూరు: పర్వాతరోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘానికి తీసుకెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సుళ్లూరుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య, పార్టీ నేత రాజారెడ్డి, స్థానిక ప్రజలు మస్తాన్ బాబు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. -
మస్తాన్ బాబు మృతదేహం చెన్నైకు తరలింపు
-
మస్తాన్‌బాబు మృతదేహం చెన్నైకు తరలింపు
న్యూఢిల్లీ: పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చెన్నైఎయిర్ పోర్టుకు తరలించారు. గురువారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని చెన్నై ఎయిర్ పోర్టుకు తరలించారు. దీంతో ఇక ప్రత్యేక అంబులెన్స్‌లో మస్తాన్ బాబు పార్థివదేహాన్ని స్వగ్రామం గాంధీ జనసంఘానికి తీసుకువెళ్లనున్నారు. మస్తాన్ బాబు స్నేహితులు, కేంద్ర విదేశాంగ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా మృతదేహం తరలింపును చేపట్టారు. మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు తెలిపే సమయం ప్రకారం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. కొద్దిరోజులపాటు ఆచూకీ కనిపించకుండా పోయారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపులో కొంత ఆలస్యం ఏర్పడింది. -
నేడు స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం
-
24న స్వగ్రామానికి మల్లి మస్తాన్ బాబు మృతదేహం
-
24న స్వగ్రామానికి మల్లి మస్తాన్ బాబు మృతదేహం
దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఈ నెల 24న స్వగ్రామానికి చేరనుంది. గురువారం రాత్రి 10:55 గంటలకు బ్యూనస్ఎయిర్స్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని చెన్నై ఎయిర్ పోర్టుకు తరలిస్తారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మస్తాన్ బాబు పార్థివదేహాన్ని స్వగ్రామం గాంధీ జనసంఘానికి తీసుకువెళతారు. మస్తాన్ బాబు స్నేహితులు, కేంద్ర విదేశాంగ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా మృతదేహం తరలింపును చేపట్టారు. మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు తెలిపిన సమయం ప్రకారం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. కొద్దిరోజులపాటు ఆచూకీ కనిపించకుండా పోయారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపులో కొంత ఆలస్యం ఏర్పడింది. -
సోమవారం స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం
-
సోమవారం స్వగ్రామానికి మస్తాన్ బాబు మృతదేహం
ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం సోమవారం ఆయన స్వగ్రామం గాంధీ జనసంగం చేరుకోనుంది. అర్జెంటీనా నుంచి ప్రత్యేక విమానంలో మల్లిబాబు మృతదేహాన్ని తరలిస్తున్నామని, ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం విమానం చెన్నై చేరుకుంటుందని ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. చెన్నై విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాడయుడు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. గత మార్చి 24న పర్వతారోహణ చేస్తూ చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు.. కొద్దిరోజులపాటు ఆచూకీ కనిపించకుండా పోయారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపులో కొంత ఆలస్యం ఏర్పడింది. సోమవారం లేదా మంగళవారం ప్రభుత్వం లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. -
'మస్తాన్‌బాబు జీవితం స్ఫూర్తిదాయకం'
ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై ట్వీట్ చేశారు. కుటుంబ నేపథ్యం అంతంతమాత్రంగానే ఉన్నా కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మల్లి మస్తాన్‌బాబు ఐఐటీలు, ఐఐఎంలలో ఉన్నత విద్య చదువుకుని, పర్వతారోహణలో రికార్డులు బద్దలుకొట్టారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. Mastan Babu, from our Nellore, educated at IIT, IIM, breaking records in mountaineering, inspite of his challenging background. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015 His life is an inspiration to us all. 2/2 pic.twitter.com/Av7BB0EwMO — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015 -
'మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటు'
ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి భావితరాలకు గుర్తుండిపోయే వ్యక్తి పపంచదేశాల్లో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేశారు ఆయన స్మారక స్తూపం ఏర్పాటు చేయాలి కుటుంబసభ్యుల్ని ఆదుకుంటాం మస్తాన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తా పభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత మస్తాన్‌బాబుకే దక్కింది. ఇటువంటి వ్యక్తి భారత్‌లో ఉండటం దేశానికే గర్వకారణం’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు ధైర్యసాహసాలను కొనియాడారు. చిలీ దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రమాదవశాత్తు పదిరోజుల క్రితం మృత్యువాత పడ్డ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగానికి చెందిన మస్తాన్‌బాబు కుటుంబాన్ని ఆయన స్వగ్రామంలో జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్.. మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి పెద్దమస్తానమ్మ, సోదరులు పెద్ద మస్తానయ్య, చిన్నమస్తాన్‌బాబులను పేరుపేరున పలకరించారు. మస్తాన్‌బాబు మృతి దేశానికి తీరని లోటన్నారు. భావితరాలకు గుర్తుండిపోయేలా ఆయన స్మారకస్తూపం ఏర్పాటుచేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మస్తాన్‌బాబు మృతదేహాన్ని చిలీ నుంచి త్వరగా తీసుకొచ్చేలా తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని, ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేసి సమాచారమిస్తే అన్నివిధాలా ఆదుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు. అంతేగాక తన ఫోన్ నంబర్‌ను మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు పేపర్‌పై రాసి ఇచ్చారు. ప్రభుత్వం కూడా మస్తాన్‌బాబు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని జగన్ కోరారు. మస్తాన్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్ పుస్తకంలో ‘మస్తాన్‌బాబు మృతి బాధాకరం. ఆయన మృతి దేశానికి తీరనిలోటు’ అని రాశారు. అదేవిధంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ‘మల్లి మస్తాన్‌బాబు రికార్డులు దేశ ప్రతిష్టను ప్రపంచదేశాల్లో సగర్వంగా నిలబెట్టాయి. అతని మృతి తీరని లోటు’అని పేర్కొన్నారు. మస్తాన్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. అంబేడ్కర్‌కు నివాళులు.. డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయుడుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి నివాళులర్పించారు. వివాహ వేడుకలకు హాజరు.. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కుమార్తె దీప్తి వివాహ కార్యక్రమానికి జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అల్లూరులోని విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో పెళ్లికుమార్తె దీప్తిని ఆశీర్వదించారు. -
మస్తాన్‌బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్
-
దేశం గర్వించదగ్గ వ్యక్తి మస్తాన్ బాబు:వైఎస్ జగన్
నెల్లూరు: పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుని కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన మల్లి మస్తాన్ బాబు దేశం గర్వించదగ్గ వ్యక్తి అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. మస్తాన్ బాబు పేరుతో స్మారక మందిరం నిర్మించాలన్నారు. మంగళవారం మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మస్తాన్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లా గాంధీ సంగంలోని మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. తొలుత మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించినవారిలో ఉన్నారు. -
మస్తాన్ బాబు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
మస్తాన్‌బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్
పర్వతారోహకుడు, ఇటీవలే అర్జెంటీనాలో మృతిచెందిన తెలుగుతేజం మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం నెల్లూరు జిల్లా గాంధీసంగంకు చేరుకున్న ఆయన.. మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించినవారిలో ఉన్నారు. పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న మస్తాన్ బాబు.. కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహం స్వస్థలానికి రావాల్సిఉంది. -
మస్తాన్ మృతదేహం తరలింపులో ఆటంకాలు
⇒ మంచు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న హెర్నన్ బృందం సంగం: నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు లాస్గ్రాట్స్ అనే ప్రాంతానికి మృతదేహాన్ని చేర్చాల్సి ఉంది. అయితే మంచు కారణంగా రోడ్డు కూడా కనపడని పరిస్థితి నెలకొనడంతో హెర్నన్ బృందం ముందుకు సాగేందుకు అవాంతరం ఏర్పడుతోంది. దీంతో ప్రస్తుతానికి బృందం గుహల వద్దకు వెనక్కు వెళ్లింది. -
బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం
మస్తాన్‌బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు చర్యలు సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన స్నేహితుడు హెర్నన్ అగస్టో ప్యారజైన్తో పాటు ఆయన బృందం శుక్రవారం అర్ధరాత్రికి బయలుదేరనుంది. ఈ వివరాలను హెర్నన్ బృందం ఫేస్బుక్ ద్వారా తెలిపింది. శుక్రవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం రాత్రి) బేస్ క్యాంపునకు చేరుకుంటుంది. పది మందితో కూడిన బృందం రెండు జట్లుగా విడిపోయి మృతదేహాన్ని తెచ్చే ప్రక్రియను ప్రారంభించనుంది. 17న మృతదేహం : మల్లి మస్తాన్‌బాబు మృతదేహం ఈ నెల 17వ తేదీన ఆయన స్వగ్రామం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీజనసంగానికి తీసుకురానున్నట్లు అక్కడి ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. మస్తాన్‌బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మ శుక్రవారం అర్జెంటీనాకు బయలుదేరి వెళ్లారు. -
మస్తాన్ బాబు ఖర్చులు మేమే భరిస్తాం: వెంకయ్య
అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో మరణించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం తరలింపునకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన మల్లి బాబు మాతృమూర్తికి సానుభూతి తెలిపారు. ఈ విషయమై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చర్చించానని, అర్జెంటీనాలోని భారత దౌత్యాకార్యాలయంతో ఆమె సంప్రదింపులు జరిపారని వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. 'మృతదేహం తరలిపునకు రెండు మార్గాలున్నాయి. ప్రతేక హెలికాప్టర్‌ను పంపడమా లేక సుశిక్షితులైన పర్వతారోహకుల ద్వారా మల్లిబాబు మృతదేహాన్ని కిందికి దించడమా అనే దానిపై సమాలోచన సాగుతోంది' అని వెంకయ్య నాయుడు అన్నారు. ఐదు ఖండాల్లో పర్వతాలను అధిరోహించి గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మల్లిబాబు.. ఆండీస్ పర్వతశ్రేణుల్ని అధిరోహించేందుకు వెళ్లి గత మార్చి 24న అదృష్యమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన మృతదేహాన్ని గుర్తించారు. -
అతడు చిరంజీవి!
కడుపులో నీళ్లు కదలకుండా, హాయిగా సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ, సవాలక్షమందిలో ఒకడిగా ఉంటే మల్లి మస్తాన్ బాబు బతికి ఉండేవాడేవాడోమో. కానీ అతడిని సాహసం అనే పురుగు తొలుస్తుంటే కుదురుగా బతకలేకపోయాడు. అడ్వెంచర్నే ఆక్సిజన్‌గా మార్చుకున్నాడు. అయితే విచిత్రంగా అతడు ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. పర్వతారోహణ సంస్థల వద్దకు వెళ్లి శాస్త్రీయంగా కొండలెక్కడం నేర్చుకోలేదు. అతడిలో ఉన్న సాహస ప్రవృత్తే మస్తాన్ బాబుకు ఆ విద్యను నేర్పింది, ఏదైనా సాధించాలన్న తపనే అతడిని ఏడు ఖండాల్లోని ఏడు కొండలను ఎక్కించింది. అతడు శిఖరాల్ని ఎంతగా ప్రేమించాడంటే - తన ప్రేమలో ఎన్పటికైనా ప్రమాదముంటుందన్న భావనతో అతడు పెళ్ళి కూడా చేసుకోలేదు. నెల్లూరు జిల్లాలోని ఓ పల్లెటూళ్లో, అందులోనూ అట్టడుగు వర్గంలో పుట్టిన మస్తాన్ బాబు పర్వతారోహకుడిగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించాడు. అయితే మన నేల మీద మాత్రం అతడు చనిపోయిన తర్వాతే ఎక్కువమందికి తెలిసి ఉంటాడు. ఇందులో మనవారి తప్పేమీ లేదు. మనకి సినిమా హీరోలు, రాజకీయ నాయకులు పట్టినంతగా సాహసికుల్లో, శాస్త్రవేత్తలో పట్టరు. నిజమైన హీరోలను బతికున్నప్పుడు పట్టించుకోకపోవటం అసలైన విషాదం. సాహసమే ఊపిరిగా బతికి మస్తాన్, ఒంటిరిగా వెళ్లి కొంత దుస్సాహసం చేశాడనే చెప్పాలి. మంచు విపరీతంగా కురిసే ప్రాంతాల్లో - శరీరాన్ని నిరంతరం వేడిగా ఉంచుకోవాలి. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ, బయట ఉన్న ద్రవ పదార్థాలు మంచులా గడ్డకట్టేనట్టే శరీరం లోపలి ప్లూయిడ్స్ కూడా క్రిస్టల్స్ గా మారే ప్రమాదముంటుంది. దాంతో పల్మనరీ ఓడిమా, సెరిబ్రల్ ఓడిమా అనే రుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదముంది. దీంతో కొన్ని గంటల్లో స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పక్కన తోడు లేకపోతే అది అంతిమంగా మృత్యువుకి దారి తీయొచ్చు. పర్వతారోహణలో ఏళ్ల తరబడి అనుభవంతో పండిపోయిన మస్తాన్ కి ఈ మాత్రం విషయాలు తెలీయవనుకోలేం. సాధించాలి, జయించాలి అన్న తొందరే అతడిని ఒంటరిగా వెళ్లే దుస్సాహసానికి పురికొల్పిందని భావించొచ్చు. ఎవరెస్ట్ ఎక్కిన తొలి తెలుగువాడిగా, ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన భారతీయుడుగా మస్తాన్ సృష్టించిన రికార్డులు, అతడి స్పూర్తి ఎప్పటికీ మిగిలే ఉంటాయి. చనిపోయినా అతడు చిరంజీవి! -
పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం
నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని పది రోజుల్లో భారత్‌కు పంపేలా చర్యలు తీసుకుంటామని చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ఆదివారం మీడియాకు తెలిపారు. చిలీలో ప్రతికూల వాతావరణం ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. అయితే మృతదేహాన్ని వారంలోగా పంపేలా చూడాలని తాను భారత ఎంబసీని కోరినట్లు ఆమె చెప్పారు. -
మస్తాన్‌బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పిస్తాం
హైదరాబాద్ : అర్జంటైనా ఆండీస్ పర్వతాలలో మృతి చెందిన మల్లి మస్తాన్‌బాబు భౌతిక కాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే విషయమై ఇప్పటికే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలో మస్తాన్ మృత దేహం చెన్నై వరకు వస్తుంది.. అక్కడి నుంచి మృతదేహాన్ని అతడి స్వగ్రామం గాంధీజన సంగం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. మల్లి మస్తాన్ బాబు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న మస్తాన్ బాబు ఇలా మరణించడం తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని శనివారం ఏరియల్ సర్వేలో గుర్తించారు. మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం గ్రామం. -
మూగబోయిన గాంధీజన సంగం
నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతితో అతడి స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజన సంగం మూగబోయింది. మస్తాన్‌బాబు మరణవార్త మీడియాలో చూసి అతడి బంధువులు, కుటుంబు సభ్యులు రోదిస్తున్నారు. అయితే మస్తాన్‌బాబు మృతి చెందారని అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని మిత్రులు బంధువులు తెలిపారు. మల్లి మస్తాన్ బాబు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వే బృందాలు గుర్తించారు.