ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్బాబు అంత్యక్రియలు | mastan babu's funeral to be held with full state honour | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్బాబు అంత్యక్రియలు

Published Fri, Apr 24 2015 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్బాబు అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్బాబు అంత్యక్రియలు

ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామమైన గాంధీ జనసంఘానికి చేరుకుంది. ఆయన మృతదేహాన్ని నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు మస్తాన్ బాబు ఇంటికి వెల్లువెత్తారు. శనివారం నాడు ఆయన స్వగ్రామంలోనే పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు తదితరులు శుక్రవారం సాయంత్రమే వెళ్లి మస్తాన్బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు.

అర్జెంటీనాలోని పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రమాదవశాత్తు మంచులో కూరుకుపోయి మస్తాన్బాబు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని బయటకు తీసేందుకు అర్జెంటీనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత సాధ్యం కాకపోయినా.. తర్వాత జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి వెంటనే భారతదేశానికి పంపారు. చెన్నై విమానాశ్రయం నుంచి సంగం మండలంలోని గాంధీ జనసంఘానికి మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement