నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతితో అతడి స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజన సంగం మూగబోయింది. మస్తాన్బాబు మరణవార్త మీడియాలో చూసి అతడి బంధువులు, కుటుంబు సభ్యులు రోదిస్తున్నారు. అయితే మస్తాన్బాబు మృతి చెందారని అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని మిత్రులు బంధువులు తెలిపారు. మల్లి మస్తాన్ బాబు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు నుంచి కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వే బృందాలు గుర్తించారు.
మూగబోయిన గాంధీజన సంగం
Published Sat, Apr 4 2015 11:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement