
బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం
- మస్తాన్‌బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు చర్యలు
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన స్నేహితుడు హెర్నన్ అగస్టో ప్యారజైన్‌తో పాటు ఆయన బృందం శుక్రవారం అర్ధరాత్రికి బయలుదేరనుంది. ఈ వివరాలను హెర్నన్ బృందం ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది. శుక్రవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం రాత్రి) బేస్ క్యాంపునకు చేరుకుంటుంది. పది మందితో కూడిన బృందం రెండు జట్లుగా విడిపోయి మృతదేహాన్ని తెచ్చే ప్రక్రియను ప్రారంభించనుంది.
17న మృతదేహం : మల్లి మస్తాన్‌బాబు మృతదేహం ఈ నెల 17వ తేదీన ఆయన స్వగ్రామం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీజనసంగానికి తీసుకురానున్నట్లు అక్కడి ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. మస్తాన్‌బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మ శుక్రవారం అర్జెంటీనాకు బయలుదేరి వెళ్లారు.