Hernan Team
-
మస్తాన్ మృతదేహం తరలింపులో ఆటంకాలు
⇒ మంచు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న హెర్నన్ బృందం సంగం: నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు లాస్గ్రాట్స్ అనే ప్రాంతానికి మృతదేహాన్ని చేర్చాల్సి ఉంది. అయితే మంచు కారణంగా రోడ్డు కూడా కనపడని పరిస్థితి నెలకొనడంతో హెర్నన్ బృందం ముందుకు సాగేందుకు అవాంతరం ఏర్పడుతోంది. దీంతో ప్రస్తుతానికి బృందం గుహల వద్దకు వెనక్కు వెళ్లింది. -
బేస్ క్యాంపునకు హెర్నన్ బృందం
మస్తాన్బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు చర్యలు సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన స్నేహితుడు హెర్నన్ అగస్టో ప్యారజైన్తో పాటు ఆయన బృందం శుక్రవారం అర్ధరాత్రికి బయలుదేరనుంది. ఈ వివరాలను హెర్నన్ బృందం ఫేస్బుక్ ద్వారా తెలిపింది. శుక్రవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం రాత్రి) బేస్ క్యాంపునకు చేరుకుంటుంది. పది మందితో కూడిన బృందం రెండు జట్లుగా విడిపోయి మృతదేహాన్ని తెచ్చే ప్రక్రియను ప్రారంభించనుంది. 17న మృతదేహం : మల్లి మస్తాన్బాబు మృతదేహం ఈ నెల 17వ తేదీన ఆయన స్వగ్రామం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గాంధీజనసంగానికి తీసుకురానున్నట్లు అక్కడి ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. మస్తాన్బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మ శుక్రవారం అర్జెంటీనాకు బయలుదేరి వెళ్లారు.