మస్తాన్బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పిస్తాం | Central govt works on malli mastan babu dead body back to india, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

మస్తాన్బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పిస్తాం

Published Sun, Apr 5 2015 12:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

మస్తాన్బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పిస్తాం

మస్తాన్బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పిస్తాం

హైదరాబాద్ : అర్జంటైనా ఆండీస్ పర్వతాలలో మృతి చెందిన మల్లి మస్తాన్బాబు భౌతిక కాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే విషయమై ఇప్పటికే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలో మస్తాన్ మృత దేహం చెన్నై వరకు వస్తుంది.. అక్కడి నుంచి  మృతదేహాన్ని అతడి స్వగ్రామం గాంధీజన సంగం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. 

మల్లి మస్తాన్ బాబు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న మస్తాన్ బాబు ఇలా మరణించడం తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను  చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద  ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని శనివారం ఏరియల్ సర్వేలో గుర్తించారు.  మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం గ్రామం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement