అది కెనడాలోని ఓ నగరం.. అక్కడ భారీగా మంచు కురుస్తోంది. రోడ్లపై మంచు చాలా పేరుకుపోయింది. దీంతో మంచు తొలగించే ప్రాంతంలో కారును పార్క్ చేయడం నిషేధం. అయితే అదే చోట ఓ కారు పార్క్ చేసి ఉంది. దీంతో ఆ కారు దగ్గరికి ట్రాఫిక్ పోలీసులు హడావుడిగా వచ్చారు. ఓ పోలీసు అధికారి దాని దగ్గరికి వెళ్లి కారుకు చలానా విధించాడు. ఆ పోలీసులకు కొద్ది సేపటికి కానీ తెలియలేదు అది నిజమైన కారు కాదని! అది మంచుతో తయారు చేసింది.
రోడ్లపై మంచును తొలగించే సైమన్ లాప్రైజ్ అనే ఉద్యోగి సరదాగా మంచుతో కారును చెక్కాడు. టొయోటా సుప్రా కారు మాదిరిగా చెక్కేందుకు ప్రయత్నించాడు. కొంచెం అటూ ఇటుగా అలాగే వచ్చిందనుకోండి. అయితే కారుపై మంచు పేరుకుపోయిందేమో అనుకుని పొరబడ్డ ఆ పోలీసు కారుకు చలానా విధించాడు. పాపం నిజం తెలిశాక ముక్కుపై వేలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు!
Comments
Please login to add a commentAdd a comment