Ram Charan Pens Lovely Birthday Wish For His Wife Upasana - Sakshi
Sakshi News home page

Upasana Birthday: భార్యకు రామ్‌చరణ్‌ స్పెషల్‌ విషెస్‌

Published Tue, Jul 20 2021 11:38 AM | Last Updated on Tue, Jul 20 2021 12:55 PM

Ram Charan Pens Lovely Birthday Wish For His Wife Upasana - Sakshi

Happy Birthday Upasana Konidela: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల నేడు (జూలై 20) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చెర్రీ తన అర్ధాంగికి సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌గా విషెస్‌ చెప్పాడు. "నీ కుటుంబం కోసం, నిరుపేదల కోసం ఏదైనా చేయడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. అలాంటి నీకు కృతజ్ఞత చెప్పడానికి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. హ్యాపీ బర్త్‌డే.." అంటూ హార్ట్‌, కేక్‌ ఎమోజీలతో ట్వీట్‌ చేశాడు. భార్య తన భుజంపై వాలి ఉన్న ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నాడు.

కాగా అనిల్‌ కామినేని, శోభన కామినేనిల కూతురే ఉపాసన. 2012 సంవత్సరంలో జూన్‌ 14న మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను పెళ్లాడి కొణిదెల ఇంట్లో కుడికాలు పెట్టింది. మరోవైపు అపోలో హెల్త్‌ కేర్‌ బాధ్యతలు చూసుకుంటూ సెలబ్రిటీల డైట్స్‌ గురించి కూడా ఇంటర్వ్యూలు చేసింది. ఆ మధ్య రైతు అవతారం ఎత్తి సేంద్రీయ వ్యవసాయం కూడా చేసి వార్తల్లో నిలిచింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement