
రామ్‌చరణ్, ఉపాసన
పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి సతీమణి ఉపాసనతో కలిసి రామ్‌చరణ్ సౌత్‌ఆఫ్రికా వెళ్లారు. అదేంటీ వారి మ్యారేజ్ డే (జూన్ 14)కి ఇంకా టైమ్ ఉంది కదా అంటే నిజమే. ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉంటారట. అందుకే ఇలా ప్రీ–మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికా వెళ్లారు చరణ్, ఉపాసన. ‘‘అడ్వాన్స్‌గా మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. డైవింగ్, అడ్వెంచర్ స్పోర్ట్, హీలింగ్ టెక్నిక్స్.. ఇలా ప్రతి పెళ్లి రోజుకీ ఇద్దరం ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంటాం.
ఈసారి వైల్డ్‌లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం. చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు ఉపాసన. అలాగే తమ హ్యాపీ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారామె. ఇంకా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ– ‘‘ఇది వన్‌వీక్ హాలీడే ట్రిప్. టాంజానియా, మౌంట్ కిలిమంజారో వంటి ప్రదేశాలను చూడాలనుకుంటున్నాం. చరణ్ కాలికి గాయం కావడం వల్ల ఎక్కువగా నడవడానికి కుదరదు. అయినప్పటికీ ట్రిప్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రేమలో పడటాన్ని చరణ్ అంతగా నమ్మరు. కానీ ప్రేమలో ఎదుగుదలను విశ్వసిస్తారు’’ అని చెప్పుకొచ్చారు ఉపాసన. అన్నట్లు.. ఈ ఏడాదితో చరణ్, ఉపాసనలది సెవెన్త్ మ్యారేజ్ డే. జూన్ 14న ఈ క్యూట్ కపుల్ మ్యారేజ్ డే.
Comments
Please login to add a commentAdd a comment