Upasana Konidela Tweet On Her Wedding Anniversary With Ram Charan, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ram Charan- Upasana: ఈ 11 ఏళ్లు ఓ అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!

Published Thu, Jun 15 2023 7:20 AM | Last Updated on Thu, Jun 15 2023 9:04 AM

Upasana Tweet On Her Wedding Anniversary With Ram Charan - Sakshi

టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. అయితే ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్షణ కోసం మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరికి పెళ్లి జూన్ 14 2012న జరిగింది. ఈ జంటకు పెళ్లై దాదాపు 11 ఏళ్లు పూర్తి కాగా.. ఈ సందర్భంగా ఉపాసన ట్వీట్ చేసింది. 

(ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!)

ఉపాసన ట్వీట్ చేస్తూ 'గడిచిన 11 ఏళ్లు చాలా అద్భుతమైన క్షణాలు' అంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌తో పాటు ఉపాసన, రామ్ చరణ్‌ రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మెగా జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement