Ram Charan Upasana Wedding Video Viral ahead of Their 10th Wedding Anniversary - Sakshi
Sakshi News home page

Ram Charan-Upasana: టెన్త్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ, వైరల్‌గా చరణ్‌, ఉపాసన పెళ్లి వీడియో

Published Mon, Jun 13 2022 4:47 PM | Last Updated on Mon, Jun 13 2022 6:03 PM

Ram Charan, Upasana Marriage Video Goes Viral On Their 10th Wedding Anniversary - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన వైవాహిక బంధానికి రేపటితో పదేళ్లు నిండనున్నాయి. జూన్‌ 14, 2012న చరణ్‌, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి 10వ వివాహ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఈ మెగా కపుల్‌ ఇటలీలో వాలిపోయారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఈ జంట అక్కడి ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

చదవండి: విజయ్‌, రష్మికల షూటింగ్‌ ఫొటోలు లీక్‌.. డైరెక్టర్‌ అప్‌సెట్‌

తాజాగా చరణ్‌ భార్యతో దిగిన ఓ క్యూట్‌ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం(జూన్‌ 14) వీరి వివాహ వార్సికోత్సవాన్ని ముందుగానే సెలబ్రెట్‌ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. ఈ సందర్భంగా చరణ్‌, ఉపాసన వెడ్డింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తూ అడ్వాన్స్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చరణ్‌, ఉప్సీల పెళ్లి వీడియో చూసేయండి.

చదవండి: వెకేషన్‌లో చరణ్‌, ఉపాసన.. క్యూట్‌ పిక్‌ షేర్‌ చేసిన మెగా హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement