జపాన్‌లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా | RRR Hero Ram Charan Meet Die Hard Fan In Japan Today | Sakshi
Sakshi News home page

Ram Charan In Japan: రామ్ చరణ్‌కు సర్‌ ప్రైజ్.. జపాన్ వీరాభిమాని పెయింటింగ్స్ అదుర్స్

Published Tue, Oct 25 2022 6:56 PM | Last Updated on Tue, Oct 25 2022 6:58 PM

RRR Hero Ram Charan Meet Die Hard Fan In Japan Today - Sakshi

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లిన చిత్రబృందానికి అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎక్కడికెళ్లినా ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. జపాన్ లో కూడా ఈ హీరోల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విదేశియులు సైతం మన ఆర్ఆర్ఆర్ హీరోల నటనకు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఓ డై హర్డ్ ఫ్యాన్‌ను కలుసుకున్నారు.

(చదవండి: రామ్‌ చరణ్‌ మాటలకు ఏడ్చేసిన జపాన్‌ ఫ్యాన్స్‌)

చరణ్‌కు వీరాభిమాని అయిన ఆ మహిళ వయసు దాదాపు 70 ఏళ్లకు పైగానే ఉంటుంది. రామ్ చరణ్ సినిమాలు గతంలో జపాన్‌లో విడుదల కావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం వెళ్లిన స్టార్ హీరో ఆమెను కలుసుకుని ఓ జ్ఞాపికను అందజేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆమె వేసిన పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని రామ్ చరణ్ ప్రశంసించారు. 

ఇంతకీ ఆమె ఎవరంటే.. జపాన్‌కు చెందిన నోరికో కాసై అనే మహిళ ఓ ఆర్టిస్ట్. రామ్ చరణ్ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఆమెతో సరదాగా మాట్లాడిన చెర్రీ ఫోటోలు దిగి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్‌ ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21న జపాన్‌ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement