
‘మగధీర, బ్రూస్‌లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లోనో, పాటలోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్‌చరణ్. ‘ఆచార్య’లో తొలిసారి పూర్తి స్థాయిలో కలసి నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఇటీవలే చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ పాటలో కొన్ని స్టెప్పులేసి వెళ్లారు చరణ్. ‘ఆచార్య’లో సీన్స్ మాత్రమే కాదు... లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మే 13న ‘ఆచార్య’ రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment