
చిరంజీవి, రామ్‌చరణ్
‘సైరా: నరసింహారెడి’్డ సక్సెస్ జోష్‌లో ఈ దసరా పండక్కి చిరంజీవి తన తర్వాతి చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని చిరంజీవి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో చరణ్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇది నిజమైతే మెగాఫ్యాన్స్‌కు పండగేనని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్ నటించిన ‘మగధీర, బ్రూస్‌లీ’ సినిమాల్లో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించారు. అలాగే చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో ఓ పాటలో తండ్రితో చరణ్ కాలు కదిపిన విషయం తెలిసిందే. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మళయాల చిత్రం తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్‌చరణ్ దక్కించుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment