
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైకెర్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, కరోనా భయాల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి కొద్ది రోజులు విరామం ఇచ్చారు. ఈనేపథ్యంలో.. చిత్ర నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం సాగుతోంది. దీనిపై మాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ సంస్థకి, మాకు ఎలాంటి విభేదాలు లేవని, సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కలిసి చర్చిస్తున్నామని ప్రకటనలో తెలిపింది. ‘ఆచార్య సినిమాకు సంబంధించి అన్ని విషయాలపై కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ అంశమైనా ఇద్దరి అంగీకారంతోనే ఫైనల్ అవుతుందని పుకార్లకి ఫుల్‌స్టాప్ పెటింది మాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. కాగా, చిరంజీవికి ఇది 152వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రాఫీ: తిరు. ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment