అది నిజం కాదు | Producer Niranjan Reddy and Chiranjeevi Statements About Ram Charan | Sakshi
Sakshi News home page

అది నిజం కాదు

Published Sun, Mar 22 2020 5:13 AM | Last Updated on Sun, Mar 22 2020 5:13 AM

Producer Niranjan Reddy and Chiranjeevi Statements About Ram Charan - Sakshi

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్‌చరణ్‌ ‘ఆచార్య’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చరణ్‌ టైమ్‌ కేటాయించడంలేదనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీని గురించి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటినుండి ప్రతి విషయంలోను రామ్‌చరణ్‌ సహకారం పూర్తిగా ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని డిస్కషన్స్‌లోనూ మాతో పాటు సమానంగా దగ్గరుండి చరణ్‌ డెసిషన్స్‌ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని బాధ్యతలను కొణిదెల ప్రొడక్షన్స్‌ అధినేత రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్వర్తిస్తున్నాయి’’ అన్నారు.
 
కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం:
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. సాయంత్రం 5 గంటలకు మన గుమ్మాల్లోకి వచ్చి వైద్య సేవలందిస్తున్న వారికి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఐకమత్యంతో ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం.
– చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement