Ram Charan Role In Acharya, Acharya Movie Updates | ఆచార్యలో రామ్‌చరణ్‌ పాత్ర అదే - Sakshi
Sakshi News home page

ఆచార్యలో రామ్‌చరణ్‌ పాత్ర అదే

Published Fri, Apr 16 2021 12:56 AM | Last Updated on Fri, Apr 16 2021 1:39 PM

Ram Charan high-voltage fight for Acharya - Sakshi

ధర్మస్థలిలో శత్రుసంహారం చేస్తున్నాడు సిద్ధ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో ‘సిద్ధ’ అనే ప్రధాన పాత్రను రామ్‌చరణ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం ధర్మస్థలి విలేజ్‌ సెట్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రబృందం తయారు చేయించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆ సెట్‌లోనే జరుగుతోంది.

రామ్‌చరణ్, సోనూ సూద్‌ కాంబినేషన్‌లో యాక్షన్‌  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement