Konidela production banner
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
‘గాడ్ ఫాదర్’లో రామ్ చరణ్.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించారని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇటీవల ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ 'ఈ మూవీలో రామ్ చరణ్ అతిథి పాత్ర పోషించారు. తెరపై చూసేందుకు తామూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఒకే ఫ్రేమ్‌లో కలిసి నటించాలని ఉందని రామ్ చరణ్ చెప్పారు. అతను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పా. మరుసటి రోజే చరణ్ తన క్యాస్ట్యూమ్స్ తీసుకుని సెట్‌కి వచ్చేశాడు' అని అన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఆచార్య’లో చిరు, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
'ఆచార్య' కథ వివాదంపై చిత్రయూనిట్ క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఓ యువ రచయిత ఇది తన కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఆచార్య చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ఆచార్య కథపై వస్తున్న కాపీ ఆరోపణలు నిరాధారమైనవని గురువారం అధికారికంగా ప్రకటన వెలువడించింది. "ఆచార్య ఒరిజినల్ కథ. ఈ కథ, కాన్సెప్ట్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుంది. ఈ కథ కాపీ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఆచార్య పోస్టర్‌ను రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ చూసి కొందరు రచయితలు ఇది వారి కథే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. (చదవండి:చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) నిజానికి ఈ సినిమా కథ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాంటిది కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ కాపీ చేశారనడం హాస్యాస్పదంగా ఉంది. ఆచార్య కథ పూర్తిగా ఒరిజినల్. కొరటాల శివలాంటి దిగ్గజ దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న రూమర్ల ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, ఎవరికి వారు ఊహించుకున్నవి మాత్రమే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని చిత్రయూనిట్ తెలిపింది. (చదవండి: ఆచార్య కోసం ఆలయం) -
అది నిజం కాదు
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్‌చరణ్ ‘ఆచార్య’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చరణ్ టైమ్ కేటాయించడంలేదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీని గురించి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటినుండి ప్రతి విషయంలోను రామ్‌చరణ్ సహకారం పూర్తిగా ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని డిస్కషన్స్‌లోనూ మాతో పాటు సమానంగా దగ్గరుండి చరణ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని బాధ్యతలను కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్వర్తిస్తున్నాయి’’ అన్నారు. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం: ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. సాయంత్రం 5 గంటలకు మన గుమ్మాల్లోకి వచ్చి వైద్య సేవలందిస్తున్న వారికి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఐకమత్యంతో ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. – చిరంజీవి -
కొణిదెల ప్రొడక్షన్స్.. ‘మెగా చలివేంద్రం’
హైదరాబాద్: గత ఐదు సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ వద్ద కొణిదెల ప్రొడక్షన్స్ తరఫున ‘మెగాచలివేంద్రం’ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో మోడల్ ‘మెగా చలివేంద్రాన్ని’ ఏర్పాటు చేశారు. అయితే దీని ఏర్పాట్లు, నిర్వహణపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు చల్లని, పరిశుభ్రమైన నీరు అందించాలని, అంతా హైజెనిక్ మెయిన్టైన్ చేయ్యాలని మెగాస్టార్ ఆదేశించారని వారు పేర్కొన్నారు. ‘ఈ మెగా చలివేంద్రం ప్రతిరోజు మూడు వేల మందికిపైగా ప్రజల దాహార్థిని తీరుస్తుంది. మోడల్ చలివేంద్రాన్ని ఖరీదైన సెట్‌తో అత్యంత శుభ్రంగా ఉంచుతాం. ఇక్కడ నిత్యం నలుగురు సిబ్బంది నీరందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు ఈ చలివేంద్రం వద్ద అనేక వాహనాలతో పాటు, సిటీబస్సులు, ఆటోలు, బైక్‌లు, పాదాచారులు ఆగి నీరు తాగి వెళుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చలివేంద్రం ప్రజలకు అందుబాటలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ చలివేంద్రంలో సుమారు 1,41,000 మంది తమ దాహార్థి తీర్చుకున్నట్లు’ మెగా చలివేంద్రం సిబ్బంది తెలిపారు. -
మెగాస్టార్, కొరటాల శివ మూవీపై క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ మూవీపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుంచీ.. కొరటాల శివతో మూవీ ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని ఏవేవో రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నంటిపై కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం.. సైరా పూర్తైన వెంటనే ప్రారంభం కానుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఈ మూవీ ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారని ఈ మూవీపై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొరటాలతో మూవీ అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. -
సైరాలో నా రోల్ అదే
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథ ఆధారంగా సైరాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి సైరాలో భాగం కానున్నాడు. తాజాగా విజయ్ నటించిన జుంగా విడుదల కాగా, చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సైరా గురించి విజయ్ ప్రస్తావించాడు. ‘బ్రిటీష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి తమిళులు - తెలుగువారిని కలిపి ఒకేతాటిపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే నా పాత్ర సినిమాలోకి ఎంటరవుతుంది. తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా - తమిళ-తెలుగు భాషల్ని కలగలిపి మాట్లాడే క్యారెక్టర్‌ను పోషించా’ అని చెప్పాడు. ఇదే తన తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా అని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నానని విజయ్ చెప్పాడు. విజయ్ చెప్పిన అంశాలను పరిశీలిస్తే ఓబయ్య పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలతో మక్కల్ సెల్వన్ విజయ్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి హిజ్రా పాత్రలో నటిస్తున్న ‘సూపర్ డీలక్స్’ కాగా.. మరొకటి పొలిటికల్ థ్రిల్లర్ ‘మామనిధన్’, వీటితోపాటు మణి రత్నం మల్టీస్టారర్ ’చెక్కా చివంత వానమ్’లో కూడా నటిస్తున్నాడు. -
మెగా బ్యానర్లో సుక్కు..!
ధృవ లాంటి సూపర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా రంగస్థలం. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్‌తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ముఖ్యంగా సుకుమార్ మేకింగ్ స్టైల్‌కు ఫిదా అయిన చెర్రీ.. సుకుమార్ దర్శకత్వంలో తమ సొంత బ్యానర్లో ఓ సినిమా నిర్మించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్ మీద దృష్టి పెట్టిన చరణ్, సుకుమార్ లు త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాలో చరణే హీరోగా నటిస్తాడా..? లేక మరో మెగా హీరోకి ఛాన్స్ ఇస్తాడా చూడాలి. -
తండ్రి పేరు చిరంజీవి... అంటే ఆంజనేయుడు
నానమ్మ పేరు అంజనాదేవి... అంటే ఆంజనేయుడి తల్లి చిరంజీవి హనుమాన్ భక్తుడనే విషయం చిరపరిచితమే.. అందుకే తండ్రి రీ-ఎంట్రీ సినిమాకి రామ్‌చరణ్ తన ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ లోగోను ఆంజనేయ స్వామి బొమ్మతో డిజైన్ చేయించి ఉంటారేమో. -
అది పూర్వజన్మ సుకృతం
చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించడంపై వీవీ వినాయక్ అంతర్వేది(సఖినేటిపల్లి): మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. ఈ చిత్రం తాలూకు స్క్రిప్టును గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలోని హీరోలతో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. వారికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రారంభమైన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మొదటి చిత్రం చిరంజీవితో చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా చిత్రం ముహూర్తం షాట్ శుక్రవారం హైదరాబాద్‌లో చిరంజీవితో చేస్తున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.