
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ మూవీపై గతకొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుంచీ.. కొరటాల శివతో మూవీ ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని ఏవేవో రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నంటిపై కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేశాయి.
ఈ రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం.. సైరా పూర్తైన వెంటనే ప్రారంభం కానుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఈ మూవీ ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారని ఈ మూవీపై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాలతో మూవీ అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment