
‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో రామ్‌చరణ్, సుకుమార్
ధృవ లాంటి సూపర్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా రంగస్థలం. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్‌తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.
ముఖ్యంగా సుకుమార్ మేకింగ్ స్టైల్‌కు ఫిదా అయిన చెర్రీ.. సుకుమార్ దర్శకత్వంలో తమ సొంత బ్యానర్‌లో ఓ సినిమా నిర్మించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్ మీద దృష్టి పెట్టిన చరణ్, సుకుమార్ లు త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాలో చరణే హీరోగా నటిస్తాడా..? లేక మరో మెగా హీరోకి ఛాన్స్ ఇస్తాడా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment