సైరాలో నా రోల్‌ అదే | Vijay Sethupathi Reveal his Role in Sye Raa | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 30 2018 8:54 PM | Last Updated on Mon, Jul 30 2018 9:32 PM

Vijay Sethupathi Reveal his Role in Sye Raa  - Sakshi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథ ఆధారంగా సైరాను సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రామ్‌ చరణ్‌ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్‌ నుంచి విజయ్‌ సేతుపతి సైరాలో భాగం కానున్నాడు. తాజాగా విజయ్‌ నటించిన జుంగా విడుదల కాగా, చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సైరా గురించి విజయ్‌ ప్రస్తావించాడు. 

‘బ్రిటీష్‌ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి తమిళులు - తెలుగువారిని కలిపి ఒకేతాటిపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే నా పాత్ర సినిమాలోకి ఎంటరవుతుంది. తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా - తమిళ-తెలుగు భాషల్ని కలగలిపి మాట్లాడే క్యారెక్టర్ను పోషించా’ అని చెప్పాడు. ఇదే తన తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా అని.. త్వరలోనే సెట్స్  పైకి వెళ్లబోతున్నానని విజయ్‌ చెప్పాడు. విజయ్‌ చెప్పిన అంశాలను పరిశీలిస్తే ఓబయ్య పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే మరో రెండు ఇంట్రెస్టింగ్‌ సినిమాలతో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి హిజ్రా పాత్రలో నటిస్తున్న ‘సూపర్‌ డీలక్స్‌’ కాగా.. మరొకటి పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘మామనిధన్‌’, వీటితోపాటు మణి రత్నం మల్టీస్టారర్‌  ’చెక్కా చివంత వానమ్‌’లో కూడా నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement