‘మగధీర’ ఈ మధ్యే విడుదలైనట్టు అనిపిస్తున్నా.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. రెండో సినిమా అయినప్పటికీ రామ్‌చరణ్ చక్కని నటన కనబరిచాడు. స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ఇందు, మిత్రవింద పాత్రల్లో మెప్పించిన కాజల్ అగర్వాల్‌కు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. టికెట్ల ధరలు తక్కువగా ఉన్న కాలంలోనే ఈ సినిమా భారీ కలెక‌్షన్లు వసూలు చేసింది. జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుంది.
‘మగధీర’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ స్పందించారు. ఇన్‌స్టాలో ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ‘మగధీర సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ సినిమా కోసం కష్టపడ్డ యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు’ అంటూ గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. ‘మగధీర’ రాజమౌళి సృష్టించిన అద్భుతమంటూ కొనియాడాడు. కాగా, రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మగధీర విడుదలైన రోజునే.. అంటే 2020, జూలై 30న విడుదల చేస్తామని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. మరోసారి అద్భుత విజయం ఆవిష్కృతమవుతుందేమో వేచి చూడాలి..!
Comments
Please login to add a commentAdd a comment