
చిరంజీవి
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు ‘సైరా’ చిత్రబృందం. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను రామ్‌చరణ్ నిర్మించారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు ‘సైరా’ చిత్రబృందం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు వాసి కాబట్టి అక్కడ ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ వేడుక ఈ నెల 15న జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ‘సైరా’ ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తారని టాక్. ఇంకా చెన్నై, బెంగళూరులో కూడా ‘సైరా’ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా ‘సైరా’ టీజర్‌ను ముంబైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment